News September 16, 2024

అమెరికాలో ఎంఎస్ ధోనీ వెకేషన్

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా తన స్నేహితులతో కలిసి అమెరికన్ ఫుట్‌బాల్ గేమ్‌కు హాజరయ్యారు. ఆయన సన్నిహితుల్లో ఒకరైన హితేశ్ ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. మహీతో పాటు ఫెడ్‌ఎక్స్ సీఈఓ రాజ్ సుబ్రమణియం కనిపిస్తున్నారు. కాగా.. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌-2025లో ధోనీ ఆడతారా లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

Similar News

News January 12, 2026

వచ్చే ఏడాది భారత పర్యటనకు ట్రంప్!

image

భారత్‌ తమకు చాలా కీలకమైన భాగస్వామి అని ఇండియాలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ అన్నారు. నిజమైన మిత్రదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోయినా.. చివరకు సామరస్యంగా పరిష్కరించుకుంటాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి గొప్ప స్నేహితుడైన ట్రంప్ వచ్చే ఏడాది భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందన్నారు. టారిఫ్‌లు, ట్రేడ్ డీల్ వంటి వివాదాల నేపథ్యంలో గోర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

News January 12, 2026

పోలవరం-నల్లమల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో TG ప్రభుత్వం పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలిపారు. కాగా గోదావరి జలాల విషయంలో MH, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.

News January 12, 2026

ఇరాన్-USA: మైత్రి నుంచి మంటల వరకు..

image

షా మహమ్మద్ రెజా హయాంలో ఆయిల్-వెపన్స్ సేల్స్‌తో ఈ రెండూ ఫ్రెండ్లీ దేశాలు. రష్యాపై USA ఇక్కడి నుంచి నిఘా పెట్టేది. 1979లో ప్రజల తిరుగుబాటుతో షా USకు వెళ్లగా అప్పగింతకై నిరసనలు, US ఆస్తులపై దాడులు జరిగాయి. ఇస్లామిక్ ఉద్యమంతో మతపెద్ద అయతుల్లా పాలన, రిలేషన్ ఫాల్ మొదలయ్యాయి. 1980లో ఇరాన్-ఇరాక్ వార్‌లో USA ఇరాక్ వైపు ఉంది. 1989లో అలీ ఖమేనీకి పగ్గాలు, అణు పరీక్షలు, చైనాతో క్రూడ్ డీల్ గ్యాప్ పెంచాయి.