News September 16, 2024
అమెరికాలో ఎంఎస్ ధోనీ వెకేషన్
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా తన స్నేహితులతో కలిసి అమెరికన్ ఫుట్‌బాల్ గేమ్‌కు హాజరయ్యారు. ఆయన సన్నిహితుల్లో ఒకరైన హితేశ్ ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. మహీతో పాటు ఫెడ్‌ఎక్స్ సీఈఓ రాజ్ సుబ్రమణియం కనిపిస్తున్నారు. కాగా.. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్-2025లో ధోనీ ఆడతారా లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
Similar News
News October 13, 2024
రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్
ఉత్తరాఖండ్ రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని దుండగులు ఉంచిన ఖాళీ గ్యాస్ సిలిండర్ కలకలం రేపింది. ధంధేరా- లాండౌరా స్టేషన్ల మధ్య ఉదయం 6:35కి గూడ్స్ రైలు వెళ్తోంది. ఈ క్రమంలో ట్రాక్‌పై సిలిండర్‌ను గుర్తించిన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఘటనా స్థలానికి పాయింట్స్‌మెన్ చేరుకొని ఖాళీ సిలిండర్‌గా గుర్తించారు. ఆగస్టు నుంచి దేశంలో ఇలాంటి 18 ఘటనలు చోటుచేసుకున్నాయి.
News October 13, 2024
పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలివే..
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. OCT, NOV, DECలో భారీగా వివాహాలు జరగనున్నాయి. ఈ 3 నెలల్లోని కొన్ని తేదీలను పండితులు పెళ్లి ముహూర్తాలుగా నిర్ణయించారు. ఇప్పటికే NOV, DECలో ముహూర్తాలు పెట్టగా, ఈనెలలోనూ నిన్నటి నుంచి పెళ్లిళ్లు మొదలయ్యాయి. OCTలో 13,16,20,27, NOVలో 3,7,8,9,10,13,14,16,17, DECలో 5,6,7,8,11,12, 14,15, 26 తేదీలు వివాహాలకు అనుకూలమైనవని పండితులు వెల్లడించారు.
News October 13, 2024
విమానాల్లో పేజర్లు, వాకీటాకీలపై ఇరాన్ నిషేధం
ప్రతీకార దాడులు తప్పవన్న ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ జాగ్రత్తపడుతోంది. హెజ్బొల్లా పేజర్ల పేలుళ్ల తరహా ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా ఇరాన్ విమానయాన శాఖ వీటిపై నిషేధం విధించింది. ప్రయాణికులు మొబైల్ ఫోన్లు మినహా పేజర్లు, వాకీటాకీలను విమాన క్యాబిన్‌లో, చెక్-ఇన్‌లో తీసుకెళ్లలేరు. దుబాయ్ నుంచి వచ్చి, వెళ్లే విమానాల్లో సహా దుబాయ్ మీదుగా వెళ్లే విమానాల్లో ఈ నిషేధాన్ని విధించారు.