News September 17, 2024
చంద్రబాబు ఇంటిని ముందుగా కూలగొట్టాలి: ఎంపీ విజయసాయి

CM చంద్రబాబు అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి అని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదనే నానుడి ఉంది. పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్న ఆయనకు బుడమేరు రివలెట్‌పై ఇళ్లను కూలగొట్టే నైతిక అధికారం ఎక్కడుంటుంది! అందుకే ముందుగా ఆయన నివాసాన్ని కూలగొట్టాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 25, 2025
ప్రధాని మోదీ ‘క్రిస్మస్’ ప్రార్థనలు

క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పర్వదినాన దేశ పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలోని సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
News December 25, 2025
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్‌లో ఉద్యోగాలు

భోపాల్‌లోని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ 3 యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి ఎంఎస్సీ( సాయిల్ సైన్స్/అగ్రికల్చరల్ కెమిస్ట్రీ/ అగ్రికల్చరల్ ఫిజిక్స్/ప్లాంట్ ఫిజియాలజీ), NET/GATE అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://iiss.icar.gov.in/
News December 25, 2025
హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా: గడ్కరీ

ఇరాన్ పర్యటన సందర్భంగా తనకు ఎదురైన అసాధారణ అనుభవాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పంచుకున్నారు. ‘2024 జులైలో ఇరాన్ ప్రెసిడెంట్‌గా మసౌద్ ప్రమాణానికి వెళ్లా. పలువురు దేశాధినేతలతోపాటు హమాస్ చీఫ్(ఇస్మాయిల్ హనియే) కూడా ఉన్నారు. ఆయన్ను నేను కలిశా. కార్యక్రమం ముగిశాక హోటల్‌కు చేరుకున్నా. 4AM సమయంలో హమాస్ లీడర్ <<13758903>>చనిపోయారని<<>> చెప్పారు. దీంతో షాక్‌కు గురయ్యా’ అని ఓ బుక్ రిలీజ్ ఈవెంట్లో తెలిపారు.


