News September 17, 2024

చంద్రబాబు ఇంటిని ముందుగా కూలగొట్టాలి: ఎంపీ విజయసాయి

image

CM చంద్రబాబు అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి అని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదనే నానుడి ఉంది. పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్న ఆయనకు బుడమేరు రివలెట్‌పై ఇళ్లను కూలగొట్టే నైతిక అధికారం ఎక్కడుంటుంది! అందుకే ముందుగా ఆయన నివాసాన్ని కూలగొట్టాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 14, 2024

ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి, గెలిచిన వ్యక్తి సాయిబాబా: నారాయణ

image

TG: అనారోగ్యంతో కన్నుమూసిన ప్రొ.సాయిబాబా పట్ల కేంద్ర వైఖరికి నిరసనగానే నిన్నటి ‘అలయ్ బలయ్‌’లో పాల్గొనలేదని CPI నేత నారాయణ అన్నారు. సాయిబాబా దివ్యాంగుడైనా ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి, రాజీలేని పోరాటం చేసి గెలిచారన్నారు. కానీ తన శరీరంతో ఓడిపోయి, ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, తన పోరాటాలతో మనతోనే ఉన్నారని తెలిపారు.

News October 14, 2024

భోజనం చేస్తుంటే కాల్పులు జరిపారు: మావోయిస్టులు

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది 31 మంది కాదని, 35 మంది అని మావోయిస్టు పార్టీ తూర్పు బస్తర్ కమిటీ ప్రకటించింది. ‘ఈ నెల 4న భోజనం చేస్తుండగా మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఒకే రోజు 11 సార్లు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14 మంది మరణించగా, గాయపడిన వారిని మరుసటిరోజు కాల్చి చంపారు. అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి గ్రామంలో సంస్మరణ సభలు నిర్వహిస్తున్నాం’ అని పేర్కొంది.

News October 14, 2024

నేడే మద్యం దుకాణాలకు లాటరీ

image

AP: రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలకు వచ్చిన 89,882 దరఖాస్తులను ఇవాళ ఎక్సైజ్ శాఖ లాటరీ తీయనుంది. విజేతలుగా నిలిచిన వారికి రేపు వైన్ షాపులను అప్పగించనుంది. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. క్వార్టర్ బాటిల్‌ను రూ.99కే విక్రయించేలా ప్రభుత్వం పాలసీ రూపొందించింది. అలాగే ఫారిన్ లిక్కర్ ఎమ్మార్పీపై చిల్లర ధర లేకుండా సర్దుబాటు చేయనుంది.