News September 18, 2024
పేజర్లలా మన మొబైళ్లనూ పేల్చేస్తే?

<<14129580>>లెబనాన్‌లో పేజర్ల<<>> పేలుళ్లతో నిత్యం మన చేతుల్లో ఉండే మొబైళ్లపై ఆందోళన వ్యక్తం అవుతోంది. సింపుల్ నెట్‌వర్క్, లిథియం బ్యాటరీలుండే డివైజులతోనే ఇంత విధ్వంసం జరిగింది. ఇక GPS ట్రాకర్, గూగుల్ మ్యాప్స్, పవర్‌ఫుల్ లిథియం బ్యాటరీ, 5జీ నెట్‌వర్క్‌తో పనిచేసే సెల్‌ఫోన్లను టెర్రరిస్టులు టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సైబర్ అటాక్స్‌పై భయం రెట్టింపైంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?
Similar News
News March 5, 2026
30 రోజుల వరకే గ్యాస్ నిల్వలు.. ధరలు పెరిగే ఛాన్స్!

LNG ఉత్పత్తిని ఖతర్ నిలిపివేయడం, హార్ముజ్ జలసంధిలో రాకపోకలు ఆగిపోవడం వల్ల ఇండియాపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం దేశంలో 30 రోజులకు సరిపడా LPG స్టాక్ మాత్రమే ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘LPG అవసరాలలో 80-85% దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో ఎక్కువ వాటా గల్ఫ్‌దే. మనకు ప్రత్యామ్నాయ సరఫరాదారులూ లేరు. ఈ నెల రావాల్సిన గ్యాస్ ఆలస్యమైతే ఇబ్బందులు తప్పవు. రేట్లు పెరిగే అవకాశం ఉంది’ అని పేర్కొన్నాయి.
News March 5, 2026
ఖమేనీ మృతిపై సంతాపం తెలిపిన భారత్

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఆయన మరణానికి సంతాపం తెలియజేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్వయంగా ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లి రాయబారులతో మాట్లాడారు. అక్కడ సంతాప సందేశ బుక్‌పై సంతకం చేశారు. కాగా ఖమేనీ మృతిపై ప్రధాని మోదీ స్పందించకపోవడాన్ని విపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
News March 5, 2026
అణుబాంబులన్నీ పేలితే ఏం జరుగుతుంది?

అమెరికా అణుబాంబులు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలను అతలాకుతలం చేశాయి. అలాంటిది ప్రపంచ దేశాలు తమ దగ్గరున్న 12వేల అణుబాంబులను ప్రయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసా? కేవలం 100 అణుబాంబులు పేలితే వచ్చే పొగ సూర్యరశ్మిని పదేళ్లపాటు అడ్డుకుంటుంది. దీనివల్ల భూమి గడ్డకట్టి ‘న్యూక్లియర్ వింటర్’ ఏర్పడుతుంది. పంటలు పండవు, గాలి కలుషితమై మనుషులు అంతమైపోతారు. అదే 12వేల అణుబాంబులు పేలితే సగం సోలార్ సిస్టమ్ ఉండదు.


