News September 19, 2024
జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఉదయభాను

AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. రేపు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఉదయభాను మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ప్రభుత్వ విప్‌గా పని చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సైతం ఈ నెల 22న జనసేనలో చేరే అవకాశం ఉంది.
Similar News
News December 30, 2025
న్యూ ఇయర్ వేళ విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు..

విశాఖలో నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, ఆర్కే బీచ్ రోడ్డు, BRTS రోడ్లపై వాహనాలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘించినా, మద్యం తాగి నడిపినా వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. బీచ్ సందర్శకులకు ఏయూ గ్రౌండ్స్, APIIC గ్రౌండ్, గోకుల్ పార్కుల్లో పార్కింగ్ కేటాయించామని ADCP ప్రవీణ్ కుమార్ తెలిపారు.
News December 30, 2025
రేపు గిగ్ వర్కర్ల సమ్మె.. ఇవాళే తెప్పించుకోండి!

స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ సంస్థల డెలివరీ ఏజెంట్లు రేపు దేశవ్యాప్త <<18699295>>సమ్మెకు<<>> పిలుపునిచ్చారు. 10 నిమిషాల డెలివరీ మోడల్‌ను రద్దు చేయాలని, సరైన వేతనం, ప్రమాద బీమా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిన్న కారణాలకే ఐడీలను బ్లాక్ చేయడాన్ని నిరసిస్తూ రేపు ‘లాగిన్’ అవ్వకూడదని నిర్ణయించుకున్నారు. రేపు డెలివరీ సర్వీసులు పనిచేయవు కాబట్టి అవసరమైన నిత్యావసరాలను ఇవాళే తెప్పించుకోండి.
News December 30, 2025
మీ నూతన సంవత్సరం శుభప్రదంగా ప్రారంభమవ్వాలని కోరుకుంటున్నారా?

వేద ఆశీర్వచనంతో కూడిన ఆయుష్య హోమం ద్వారా పాత దోషాలు తొలగి, దేవతల అనుగ్రహంతో నూతన సంవత్సరం శుభప్రదంగా మొదలవుతుంది. ఈ సంవత్సరం వ్యాపారం, వృత్తి, జీవన ప్రయాణంలో ఐశ్వర్యం, విజయం, స్థిరత్వం పొందే అనుగ్రహాన్ని కూడా పొందండి. మీ పేరు & గోత్రంతో వేదమందిర్‌లో ఇప్పుడే <


