News September 19, 2024
జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఉదయభాను
AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. రేపు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఉదయభాను మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ప్రభుత్వ విప్‌గా పని చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సైతం ఈ నెల 22న జనసేనలో చేరే అవకాశం ఉంది.
Similar News
News October 3, 2024
అంబానీ ఇంటికి రూ.వెయ్యి కోట్ల విమానం
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దాదాపు రూ.వెయ్యికోట్లు ఖర్చు చేసి కొన్న బోయింగ్ 737 MAX 9 ఇండియాకు వచ్చింది. ఇది మన దేశంలోనే అత్యంత ఖరీదైన విమానమని తెలుస్తోంది. ఆయన దగ్గర ఇప్పటికే తొమ్మిది ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. ఇటీవల ఆయన కొన్న ఈ బోయింగ్ ఫ్లైట్ విదేశాల్లో టెస్టు తర్వాత తాజాగా ఇండియాకు చేరుకుంది. ఈ విమానం 838kmph వేగంతో నాన్ స్టాప్‌గా 11,770kmలు ప్రయాణిస్తుంది.
News October 3, 2024
మాట్లాడితే మతోన్మాదులం అవుతామా?: పవన్
మసీదులు, చర్చిలు కట్టించిన చరిత్ర సనాతన ధర్మానిదని పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘మిగతా మతాలపై దాడి జరిగితే అందరూ మాట్లాడుతారు. సనాతన ధర్మంపై దాడి జరిగితే మాత్రం మాట్లాడాలంటే హిందువులకు భయం. మాట్లాడితే మతోన్మాదులమా? నాకు ఎలాంటి భయం లేదు. చేతులు కట్టుకుని కూర్చుంటామా? మనకు ధైర్యం లేకపోతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామనే YCP లాంటి స్వార్థపూరిత శక్తులు విజయ దుందుభి మోగిస్తాయి’ అని ఫైర్ అయ్యారు.
News October 3, 2024
నవంబర్ రెండో వారంలో ‘పుష్ప-2’ ట్రైలర్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ 6వ తేదీన రిలీజయ్యే ఈ చిత్ర ట్రైలర్ నవంబర్ రెండో వారంలోనే విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని పేర్కొన్నాయి. రిలీజ్‌కు ముందు మరో ట్రైలర్ ఉండే అవకాశం ఉంది.