News September 20, 2024
ఆందోళన విరమించిన కోల్‌కతా వైద్యులు
కోల్‌కతాలో RG కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో న్యాయం కోసం పోరాడుతున్న జూనియర్ వైద్యులు తమ నిరసనల్ని విరమించారు. ఇటీవల వారు రాష్ట్ర సర్కారుతో జరిపిన చర్చలు ఫలవంతమైనట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నిరసనలకు స్వస్తి పలికి శనివారం నుంచి విధులకు హాజరవుతామని వారు ప్రకటించారు. అత్యవసర సేవల్ని ప్రారంభిస్తామని, ఓపీడీ సేవల నిలిపివేత మాత్రం కొనసాగుతుందని తెలిపారు.
Similar News
News December 21, 2024
మరికొన్ని గంటల్లో అద్భుతం
ఈరోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఎప్పటిలా కాకుండా ఈరోజు ముందుగానే రాత్రి కానుంది. భూభ్రమణంలో భాగంగా సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష్య దూరం పెరిగి 16గంటల సుదీర్ఘ రాత్రి ఉండనుంది. ఈరోజు ఉదయం 7.10గంటలకు సూర్యుడు ఉదయించగా సూర్యకాంతి దాదాపు 8 గంటలే ఉండనుంది. ఇలా సుదీర్ఘ రాత్రి ఏర్పడే రోజు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
News December 21, 2024
పులివెందుల MLAకు జన్మదిన శుభాకాంక్షలు: నాగబాబు
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు జనసేన నేత నాగబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే పదికాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ‘X’లో పోస్ట్ చేశారు. జగన్‌కు సీఎం చంద్రబాబు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే.
News December 21, 2024
నా సహచరులు విధిలేక బీఆర్ఎస్‌లో ఉన్నారు: సీఎం రేవంత్
కొంతమంది నేతలు విధిలేక BRSలో కొనసాగుతున్నారని CM రేవంత్ అన్నారు. ‘BRSలోనూ రాష్ట్రం కోసం ఆలోచించే కొంతమంది ఉన్నారు. విధిలేని పరిస్థితుల్లో, రాజకీయ కారణాలతో వేరే దారిలేక ఆ పార్టీలో కొనసాగుతున్నారు. వారు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. నగరం అభివృద్ధి చెందితే వారి గౌరవం పెరుగుతుంది. ఆ నేతలకు చెబుతున్నా. BRS వారితో సావాసం చేయకండి. వాళ్లు తెలంగాణ సమాజం కోసం పనిచేసే రకాలు కాదు’ అని పేర్కొన్నారు.