News September 20, 2024
ఆందోళన విరమించిన కోల్‌కతా వైద్యులు
కోల్‌కతాలో RG కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో న్యాయం కోసం పోరాడుతున్న జూనియర్ వైద్యులు తమ నిరసనల్ని విరమించారు. ఇటీవల వారు రాష్ట్ర సర్కారుతో జరిపిన చర్చలు ఫలవంతమైనట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నిరసనలకు స్వస్తి పలికి శనివారం నుంచి విధులకు హాజరవుతామని వారు ప్రకటించారు. అత్యవసర సేవల్ని ప్రారంభిస్తామని, ఓపీడీ సేవల నిలిపివేత మాత్రం కొనసాగుతుందని తెలిపారు.
Similar News
News October 5, 2024
‘ఈక్వల్ పే = ఈక్వల్ ట్రోల్’.. మహిళా క్రికెటర్లపై విమర్శలు
T20WCలో భారత మహిళల జట్టు నిన్న NZ చేతిలో ఓడింది. దీంతో ఆ జట్టుపై SMలో ట్రోలింగ్ మొదలైంది. ట్రోల్స్‌ను సపోర్ట్ చేస్తూ ‘ఈక్వల్ పే = ఈక్వల్ ట్రోల్’ అని కొందరు పోస్టులు చేస్తున్నారు. మెన్స్ క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లు జీతాలు తీసుకుంటున్నప్పుడు ట్రోలింగ్‌ను కూడా అలాగే స్వీకరించాలంటున్నారు. ₹కోట్ల జీతాలు తీసుకుంటూ ప్రత్యర్థికి పోటీనివ్వకుండా ఓడటాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
News October 5, 2024
దేశంలో సంపన్న రాష్ట్రాలు.. AP, TG స్థానాలివే
FY2024-25లో GSDP, GDP అంచనాల ప్రకారం ₹42.67 లక్షల కోట్లతో మహారాష్ట్ర దేశంలోనే రిచెస్ట్ స్టేట్‌గా నిలిచింది. ఆ తర్వాత తమిళనాడు(₹31.55L cr), కర్ణాటక(₹28.09L cr), గుజరాత్(₹27.9L cr), UP(₹24.99L cr), బెంగాల్(₹18.8L cr), రాజస్థాన్(₹17.8L cr), TG(₹16.5L cr), AP(₹15.89L cr), MP(₹15.22L cr) ఉన్నాయి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా, బాలీవుడ్‌కు కేంద్రంగా ఉండటం, భారీ పరిశ్రమల కారణంగా MH టాప్‌లో ఉంది.
News October 5, 2024
బాధ్యతలు చేపట్టిన కార్పొరేషన్ ఛైర్మన్లు
AP: రాష్ట్రంలో వివిధ సంస్థల ఛైర్మన్లు ఇవాళ అమరావతిలో తమ బాధ్యతలు చేపట్టారు. మారిటైమ్ బోర్డు ఛైర్మన్-దామచర్ల సత్య, పర్యాటక శాఖ ఛైర్మన్-నూకసాని బాలాజీ, ఏపీఐఐసీ ఛైర్మన్-మంతెన రామరాజు బాధ్యతలు తీసుకున్నారు. వీరికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.