News September 20, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తిగల్గు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: స్వాతి కార్తెలో వర్షపు చినుకు ఆలుచిప్పలో పడితే ముత్యం అవుతుంది. అదే వర్షం నీటిలో పడితే అదే నీటిలో కలిసిపోతుంది. అదే విధంగా ఏదైనా దక్కాలనే ప్రాప్తి ఉంటే అదృష్టము ఎక్కడికీ పోదు.

Similar News

News December 30, 2024

యూట్యూబ్‌లో టెన్త్ పేపర్.. నిందితుడు అరెస్ట్

image

AP: టెన్త్ హాఫ్ ఇయర్లీ పరీక్ష పేపర్లను యూట్యూబ్‌లో <<14900742>>అప్‌లోడ్ చేసిన<<>> అరుణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఎడ్యుకేషన్ కౌన్సిల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎగ్జామ్‌కు ముందు రోజు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌ను అరుణ్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ పరీక్షను రద్దు చేసి ఈ నెల 20న నిర్వహించారు.

News December 30, 2024

కెరీర్‌లోనే రోహిత్ శర్మ చెత్త రికార్డు

image

టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ ఏడాది 619 రన్స్ చేసిన అతను 24.76 యావరేజ్‌ నమోదుచేశారు. 11 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఇదే అత్యల్ప యావరేజ్. 2013లో 66.60, 2014లో 26.33, 2015లో 25.07, 2016లో 57.60, 2017లో 217, 2018లో 26.28, 2019లో 92.66, 2021లో 47.68, 2022లో 30, 2023లో 41.92 యావరేజ్‌తో రన్స్ చేశారు.

News December 30, 2024

vitamin D దొరికే ఫుడ్స్ ఇవే

image

ఒంటికి మేలు చేసే <<15021724>>vitamin D<<>> ఆహారంలో కన్నా సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఉదయం, సాయంత్రం పడే ఎండలో వాకింగ్, ఎక్సర్‌సైజులు చేయాలని వైద్యులు సూచిస్తారు. ఇక సాల్మన్, సార్డైన్స్, హెర్రింగ్, మాకెరెల్ వంటి చేప నూనెలో బాగా దొరుకుతుంది. రెడ్ మీట్, లివర్, కోడిగుడ్డు సొన, కొన్ని తృణ ధాన్యాల్లోనూ లభిస్తుంది. వైద్యులు, న్యూట్రిషనిస్టుల సూచన మేరకు vitamin D సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.