News September 20, 2024

80 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్ పోటీల్లో!

image

నైపుణ్యం సాధించేందుకు వయసుతో పని లేదనే విషయాన్ని గుజరాత్‌కు చెందిన 80 ఏళ్ల స్విమ్మర్ బకుల పటేల్ నిరూపించారు. 13 ఏళ్లకే పెళ్లవడం, పిల్లలు యుక్తవయసులో ఉండగానే భర్తను కోల్పోవడంతో ఆమె ఒంటరైపోయారు. భయాన్ని పోగొట్టేందుకు పటేల్ ఈతను ఎంచుకున్నారు. 58 ఏళ్ల వయసులో నదిలో మునిగి ప్రాణాలతో బయటపడ్డారు. అయినా పట్టుదలతో ఈతలో ప్రావీణ్యం పొందారు. ఇప్పటికే 9 అంతర్జాతీయ విజయాలు సహా 530+ పతకాలు సొంతం చేసుకున్నారు.

Similar News

News September 20, 2024

చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: జగన్

image

AP: తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ‘ముంబై నటి కేసు, IPSల సస్పెన్షన్, మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటనలతో డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చారు. విజయవాడ వరదలపై ముందస్తు చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వంపై విమర్శలు వస్తుంటే బ్యారేజీ గేట్ల వద్దకు బోట్లు వదిలారని అంటున్నారు. ఇప్పుడు తిరుమల నెయ్యి అంశాన్ని తెరపైకి తెచ్చారు’ అని ఫైర్ అయ్యారు.

News September 20, 2024

కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ: జగన్

image

AP: చంద్రబాబు అనే వ్యక్తి దుర్మార్గుడని YS జగన్ ధ్వజమెత్తారు. ‘దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగాలనే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. 100 రోజుల చంద్రబాబు పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారమంతా ఓ కట్టు కథ. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు’ అని జగన్ మండిపడ్డారు.

News September 20, 2024

తిరుమల ఆలయ ప్రతిష్ఠను కాపాడాలి: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల ఆలయ ప్రతిష్ఠను భక్తులు, ప్రజలు కాపాడాలని టీటీడీ ఈఓ శ్యామలరావు కోరారు. శ్రీవారి లడ్డూ వివాదంపై ఈఓ స్పందించారు. ‘రికార్డుల్లో లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యిని వాడాలని ఉంది. నెయ్యి నాణ్యతను పరీక్షించే పరికరాలను గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చింది. వాటితోనే నెయ్యి నాణ్యతను పరీక్షిస్తున్నాం. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.