News September 20, 2024
80 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్ పోటీల్లో!
నైపుణ్యం సాధించేందుకు వయసుతో పని లేదనే విషయాన్ని గుజరాత్‌కు చెందిన 80 ఏళ్ల స్విమ్మర్ బకుల పటేల్ నిరూపించారు. 13 ఏళ్లకే పెళ్లవడం, పిల్లలు యుక్తవయసులో ఉండగానే భర్తను కోల్పోవడంతో ఆమె ఒంటరైపోయారు. భయాన్ని పోగొట్టేందుకు పటేల్ ఈతను ఎంచుకున్నారు. 58 ఏళ్ల వయసులో నదిలో మునిగి ప్రాణాలతో బయటపడ్డారు. అయినా పట్టుదలతో ఈతలో ప్రావీణ్యం పొందారు. ఇప్పటికే 9 అంతర్జాతీయ విజయాలు సహా 530+ పతకాలు సొంతం చేసుకున్నారు.
Similar News
News October 5, 2024
నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం
నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గద్దె గాయత్రి(38) గుండెపోటుతో మరణించారు. నిన్న కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో HYDలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News October 5, 2024
ఛత్తీస్‌గఢ్‌లో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 36 మంది మావోయిస్టులు హతమయ్యారు. CRPF, BSF, కోబ్రా, STF విభాగాలకు చెందిన 1500 మంది జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్ అని బస్తర్ IG పేర్కొన్నారు. 2026 కల్లా మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని కేంద్రమంత్రి అమిత్ షా ఇటీవలే స్పష్టంచేశారు.
News October 5, 2024
ధాన్యం సేకరణపై సీఎం కీలక నిర్ణయం
AP: ధాన్యం సేకరణ ప్రక్రియలో రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. రైతులు తమకు ఇష్టమైన మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రవాణా వాహనాలు, గోనె సంచులు సమకూర్చాలని, లేబర్ ఛార్జీలను చెల్లించాలని అధికారులకు సూచించారు. బయోమెట్రిక్ ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని, రవాణా వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలన్నారు.