News September 20, 2024
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్
AP: నటి కాదంబరి జెత్వానీ కేసుకు సంబంధించి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆయనను అదుపులోకి తీసుకుని రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. కాగా తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచి వేధించారని జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు.
Similar News
News December 22, 2024
వైసీపీ జిల్లా బూత్ కమిటీల విభాగం అధ్యక్షుడిగా అమర్నాథ్ రెడ్డి
అనంతపురం వైసీపీ జిల్లా బూత్ కమిటీల విభాగం అధ్యక్షుడిగా వై.అమర్నాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికు రుణపడి ఉంటానని తెలిపారు.
News December 22, 2024
పుణ్యక్షేత్రాల్లో పెరిగిన రద్దీ
వారాంతం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో శ్రీనివాసుడి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,411మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా హుండీకి రూ.3.44 కోట్ల ఆదాయం సమకూరింది. అటు యాదాద్రిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
News December 22, 2024
భారత్‌ను బలవంతం చేయలేరు: జైశంకర్
భారత్ ఎప్పుడైనా స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తేల్చిచెప్పారు. నిర్ణయాల్ని మార్చుకునేలా తమను వేరే దేశాలు ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. ‘స్వతంత్రంగా ఉండేందుకు, మధ్యస్థంగా ఉండటానికి మధ్య వ్యత్యాసం ఉంది. మాకెప్పుడూ భారత ప్రయోజనాలు, ప్రపంచ శాంతే ముఖ్యం. అందుకు అవసరమైన నిర్ణయాలే తీసుకుంటాం. భారతీయతను కోల్పోకుండా ఎదుగుతాం’ అని వివరించారు.