News September 20, 2024
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్
AP: నటి కాదంబరి జెత్వానీ కేసుకు సంబంధించి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆయనను అదుపులోకి తీసుకుని రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. కాగా తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచి వేధించారని జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు.
Similar News
News October 4, 2024
శుభ ముహూర్తం
తేది: అక్టోబర్ 4, శుక్రవారం
విదియ: తె.5.30 గంటలకు
చిత్త : సా.6.37 గంటలకు
వర్జ్యం: రా.12.54 నుంచి రా.2.42 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.8.21 నుంచి ఉ.9.09 గంటల వరకు
(2) మ.12.19 నుంచి మ.1.07 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
News October 4, 2024
నేటి ముఖ్యాంశాలు
* సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న మంత్రి సురేఖ
* సురేఖపై పరువునష్టం దావా వేసిన నాగార్జున
* సురేఖ వ్యాఖ్యలను ఖండించిన చిరు, ఎన్టీఆర్, మహేశ్, నాని
* కిరాయి మనుషులతో కేటీఆర్, హరీశ్ హడావుడి: రేవంత్
* జగన్ లడ్డూ అపవిత్రం చేశారని మేం చెప్పలేదు: పవన్
* కేసులకు YCP శ్రేణులు భయపడొద్దు: జగన్
* PM-RKVY స్కీమ్‌కు కేంద్రం రూ.లక్ష కోట్ల మంజూరు
News October 4, 2024
ఒక్కో కార్మికుడికి ₹1.92 లక్షల జీతం, ₹16,515 బోనస్
పాలస్తీనా, లెబనాన్, ఇరాన్‌తో యుద్ధాల వల్ల ఇజ్రాయెల్‌లో ఏర్పడిన కార్మికుల కొరత భారతీయులకు కాసుల పంట కురిపిస్తోంది. ఇజ్రాయెల్‌లో పనిచేయడానికి భారత ప్రభుత్వం ద్వారా ఎంపికైన స్కిల్డ్ వర్కర్స్‌కు నెలకు ₹1.92 లక్షల జీతం, ₹16,515 బోనస్, వైద్య బీమా, వసతి లభిస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా సరే భారతీయులు అక్కడ పనిచేయడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటిదాకా 11 వేల మందిని ఎంపిక చేశారు.