News September 20, 2024

కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై KCR పేరుంటుంది: హరీశ్‌రావు

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు బోగస్ మాటలు మానుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మల్లన్నసాగర్ నిండుకుండలా ఉందంటే కాళేశ్వరం పుణ్యమేనని అన్నారు. ఎల్లంపల్లి మొదలుకుని కొండపోచమ్మ వరకు గోదావరి జలాలు వస్తున్నాయంటే ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై, రైతుల గుండెల్లో కేసీఆర్ ఉంటారని హరీశ్ వ్యాఖ్యానించారు.

Similar News

News September 21, 2024

ANR విలన్‌గా ఎందుకు చేయలేదో తెలుసా!

image

తన లోపాలను తెలుసుకోవడమే తన విజయానికి కారణమని అక్కినేని నాగేశ్వరరావు చెబుతుండేవారు. ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక, విలన్ పాత్రలు వేశారు. కానీ అక్కినేని ఒక్కసారీ విలనీ వైపు వెళ్లలేదు. పౌరాణికాల్ని పెద్దగా టచ్ చేయలేదు. తన రూపం, కంఠం అందుకు సరైనవి కావని ఆయన భావించడమే దానిక్కారణం. కానీ సాంఘిక సినిమాల్లో మాత్రం విశ్వరూపం చూపించారు. నేడు ఆ మహానటుడి శతజయంతి. సినిమా ఉన్నంతకాలం ఆయన మన మధ్య జీవించే ఉంటారు.

News September 21, 2024

అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు: నాదెండ్ల

image

AP: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్టోబర్ 1నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. పంట నష్టం, తడిసిన ధాన్యానికి సంబంధించి విధివిధానాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన రూ.1700 కోట్లను తాము చెల్లించామని పేర్కొన్నారు.

News September 21, 2024

BJP స్టిక్కర్ అన్ని నేరాల నుంచి రక్షిస్తుంది: కాంగ్రెస్ ధ్వ‌జం

image

గురుగ్రామ్‌లో రాంగ్ రూట్‌లో వెళ్తున్న ఓ కారు వ్య‌క్తి మృతికి కార‌ణ‌మ‌వ్వ‌డంపై BJPని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఈ ఘ‌ట‌న‌లో బైక‌ర్ మృతికి కార‌ణ‌మైన కారు డ్రైవ‌ర్‌కు ఒక్క రోజులోనే బెయిల్ మంజూరైంది. అత‌ని కారుపై BJP స్టిక్క‌ర్ ఉండ‌డమే దీనికి కారణమనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ స్టిక‌ర్ అన్ని నేరాల నుంచి ర‌క్షిస్తుందంటూ కాంగ్రెస్ విమర్శించింది. ఇది బీజేపీ జంగిల్ రూల్ అంటూ మండిప‌డింది.