News September 20, 2024
కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై KCR పేరుంటుంది: హరీశ్‌రావు
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు బోగస్ మాటలు మానుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మల్లన్నసాగర్ నిండుకుండలా ఉందంటే కాళేశ్వరం పుణ్యమేనని అన్నారు. ఎల్లంపల్లి మొదలుకుని కొండపోచమ్మ వరకు గోదావరి జలాలు వస్తున్నాయంటే ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై, రైతుల గుండెల్లో కేసీఆర్ ఉంటారని హరీశ్ వ్యాఖ్యానించారు.
Similar News
News October 10, 2024
బీజేపీ నేతల్ని హెచ్చరించిన మావోయిస్టులు
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఛత్తీస్‌గఢ్ బీజేపీ నేతల్ని మావోయిస్టులు హెచ్చరించారు. పార్టీ విస్తరణ చర్యలు నిలిపివేయాలని బీజేపీ నేతలు వెంకటేశ్వర్, బిలాల్ ఖాన్‌లను బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టుల మాడెడ్ ఏరియా కమిటీ ఆదేశించింది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. దీంతో బీజాపూర్, సుక్మా జిల్లాల్లో బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్ నిలిచిపోయింది.
News October 10, 2024
నా బిడ్డను దేశమంతా బస్సులో తిరగమన్నాను: ఆమిర్
తన కుమారుడు జునైద్‌ను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బస్సులో తిరగమని చెప్పానని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తెలిపారు. త్వరలో టెలికాస్ట్ కానున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఎపిసోడ్‌లో ఆయన ఈ విషయం చెప్పారు. ‘భారత్ అనేక సంస్కృతులకు నిలయం. దేశవ్యాప్తంగా ప్రయాణించి అవన్నీ తెలుసుకోవాలని, ప్రజలతో మమేకమవ్వాలని చెప్పాను. ఏ స్కూల్, కాలేజీ చెప్పని అంశాలు ఈ ప్రయాణంలో తెలుస్తాయి’ అని పేర్కొన్నారు.
News October 10, 2024
గాజాలో పరిస్థితుల్ని చక్కదిద్దండి: ఇజ్రాయెల్‌కు అమెరికా సూచన
గాజాలో పరిస్థితులు అత్యంత ఘోరంగా ఉన్నాయంటూ అమెరికా తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. అత్యవసరంగా ఆ పరిస్థితుల్ని చక్కదిద్దాలని సూచించింది. ‘మానవతా సాయాన్ని అడ్డుకోవడాన్ని ఇజ్రాయెల్ మానుకోవాలి. గాజా ప్రజల వేదనను తగ్గించేందుకు సహకరించాలి. యుద్ధకాలం దాటిపోయింది. ఇది హమాస్‌తో ఒప్పందానికి వచ్చి ఇజ్రాయెల్ పౌరుల్ని ఇంటికి తెచ్చుకునే సమయం’ అని UNలో అమెరికా స్పష్టం చేసింది.