News September 20, 2024
సీఎం తమ్ముడు, బావమరిదికే అన్ని కాంట్రాక్టులు: కేటీఆర్
TG: రాష్ట్రంలో అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, తోఖన్ సాహూకు లేఖ రాశారు. అర్హతలు లేకున్నా CMరేవంత్ తమ్ముడు, బావమరిదికే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. టెండర్ల సమాచారాన్ని ప్రభుత్వం తొక్కిపెడుతోందని విమర్శించారు. దీనిపై స్పందించకుంటే కాంగ్రెస్ అవినీతిలో కేంద్రం వాటా ఉందని ప్రజలు నమ్ముతారు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 21, 2024
పాతబస్తీలో చ.గజానికి రూ.81వేలు ఇస్తున్నాం: ఎన్వీఎస్ రెడ్డి
TG: పాతబస్తీలో మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. విస్తరణపై ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు రచిస్తోందని, త్వరలోనే సీఎం పూర్తి వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. పాతబస్తీలో మెట్రో మార్గం కోసం 1100 ఆస్తులను సేకరిస్తున్నామని, చదరపు గజానికి రూ.81వేలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నిర్వాసితులకు చెక్కులు ఇచ్చి, నిర్మాణాలను తొలగిస్తామని వెల్లడించారు.
News December 21, 2024
పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ నటి
ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ సీజన్-8తో పాపులర్ అయిన నటి సోనియా ఆకుల వివాహం చేసుకున్నారు. తన ప్రియుడి యశ్‌తో ఇవాళ తెల్లవారుజామున ఆమె పెళ్లి జరిగింది. ఈ వేడుకకు బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో పాటు ఇతర నటులు హాజరయ్యారు. తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా ఆర్జీవీ తెరకెక్కించిన రెండు చిత్రాల్లో నటించారు. దీంతో ఆమెకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.
News December 21, 2024
రేవంత్‌ను పిచ్చాసుపత్రిలో చూపించాలి: KTR
TG: CM రేవంత్ పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద KTR విమర్శించారు. ‘ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించాలని కుటుంబీకులను కోరుతున్నా. ఎవరినో కరిచేలా ఉన్నాడు’ అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు రైతుబంధు లేదని, అరకొర రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. కాగా శాసనసభ నిరవధిక వాయిదా పడింది.