News September 20, 2024
సీఎం తమ్ముడు, బావమరిదికే అన్ని కాంట్రాక్టులు: కేటీఆర్
TG: రాష్ట్రంలో అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, తోఖన్ సాహూకు లేఖ రాశారు. అర్హతలు లేకున్నా CMరేవంత్ తమ్ముడు, బావమరిదికే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. టెండర్ల సమాచారాన్ని ప్రభుత్వం తొక్కిపెడుతోందని విమర్శించారు. దీనిపై స్పందించకుంటే కాంగ్రెస్ అవినీతిలో కేంద్రం వాటా ఉందని ప్రజలు నమ్ముతారు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 5, 2024
జెర్రి పడిందన్నది అవాస్తవం.. నమ్మొద్దు: TTD
తిరుమల అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందంటూ వస్తున్న ఆరోపణల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. అవి అవాస్తవాలని తేల్చిచెప్పింది. ‘వేలాదిమందికి వడ్డించేందుకు ప్రసాదాన్ని తయారుచేస్తారు. అంత వేడిలో ఓ జెర్రి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉందనడం ఆశ్చర్యకరం. ఇది కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తోంది. దయచేసి భక్తులు ఇలాంటి వార్తల్ని నమ్మొద్దని టీడీపీ విజ్ఞప్తి చేస్తోంది’ అని ఓ ప్రకటనలో కోరింది.
News October 5, 2024
Exit Polls: బీజేపీకి ప్రతికూల ఫలితాలు
JK, హరియాణా ఎన్నికల్లో BJPకి ప్రతికూల ఫలితాలు తప్పవని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 90 స్థానాలున్న JKలో BJP సాధించే సీట్లపై సర్వే అంచనాలు. *పీపుల్స్ పల్స్ 23-27 *దైనిక్ భాస్కర్ 20-25 *గలిస్తాన్ News 28-30 *India Today/CVoter 27-32. హరియాణా: పీపుల్స్ పల్స్ 26 *దైనిక్ భాస్కర్ 19-29 *మ్యాట్రిజ్ 18-24 * ధ్రువ్ రీసెర్చ్ 27-32. BJP రెండు చోట్లా మెజారిటీ మార్క్ సాధించలేదని సర్వేలు తేల్చాయి.
News October 5, 2024
రూ.121 కోట్లు పెట్టి నంబర్ ప్లేట్ కొన్నాడు! ఎందుకంటే..
అబుదాబికి చెందిన వ్యాపారవేత్త సయీద్ 2008లో సుమారు రూ.121 కోట్లు వెచ్చించి ‘1’ అంకె ఉన్న నంబర్ రిజిస్ట్రేషన్ చేయించారు. పిచ్చి పని అంటూ అప్పట్లో విమర్శించిన వారే అది తెలివైన పెట్టుబడి అని ఇప్పుడు చెబుతున్నారు. అందుక్కారణం.. సింగిల్ డిజిట్ ప్లేట్స్ UAEలో మొత్తమ్మీద 63 మాత్రమే ఉన్నాయి. అందులోనూ ‘1’ అనేది అక్కడి శ్రీమంతులకి స్టేటస్ సింబల్. నేడు ఉన్న డిమాండ్‌కి ఆ నంబర్ విలువ రూ. 168కోట్లకు పైమాటే!