News September 21, 2024

మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ మృతి

image

AP: మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ (72) మరణించారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. రేపు విజయవాడలోని మొగల్రాజపురంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1983లో టీడీపీ తరఫున విజయవాడ తూర్పు నుంచి జయప్రకాశ్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు అత్యంత సన్నిహితులు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.

Similar News

News September 21, 2024

భద్రతామండలిలో చేరేందుకు భారత్‌కు ఉన్న అడ్డంకులివే

image

ఐరాస భద్రతామండలి(UNSC)లో US, ఫ్రాన్స్, రష్యా, UK, చైనాలు శాశ్వత సభ్యదేశాలు. భారత్‌కు అన్ని అర్హతలూ ఉన్నా సభ్యత్వం మాత్రం దక్కడం లేదు. వీటో అధికారంతో చైనా మోకాలడ్డుతుండటం, ‘వీటో పవర్ లేకుండానే సభ్యత్వం’ అనే ప్రతిపాదనకు భారత్ నిరాకరణ, తాము చెప్పిన మాట భారత్ వినదేమోనన్న పశ్చిమ దేశాల అనుమానాలు, పొరుగు దేశాలపై భారత్‌కు నియంత్రణ లేకపోవడం కారణాలుగా ప్రపంచ రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

News September 21, 2024

నేను ఏసీ వ్యాన్‌లో.. రజనీ నేలమీద: అమితాబ్

image

రజనీకాంత్ వెట్టయాన్ మూవీలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్‌కు ఆయన తన వీడియో మెసేజ్‌ను పంపించారు. ‘ఇది నా తొలి తమిళ సినిమా. 1991లో వచ్చిన హమ్ సినిమాలో నేను, రజనీ కలిసి నటించాం. ఆ షూటింగ్‌లో నేను ఏసీ కారవ్యాన్‌లో పడుకుంటే తను మాత్రం సెట్‌లో నేలపై నిద్రించేవారు. ఆ సింప్లిసిటీ చూశాక నేనూ బయటే పడుకునేవాడిని’ అని గుర్తుచేసుకున్నారు.

News September 21, 2024

ప్ర‌తి అంశంలో బీజేపీని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్‌

image

BJPని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ అవినీతి వల్లే శివాజీ విగ్రహం కూలిందని, గురుగ్రామ్‌లో బైక‌ర్ మృతికి కార‌ణ‌మైన కారుపై BJP స్టిక్క‌ర్ ఉండ‌డం వ‌ల్లే ఆ డ్రైవ‌ర్‌కు ఒక్కరోజులోనే బెయిల్ వచ్చింద‌ని విమ‌ర్శించింది. పుణేలో పేవ్‌మెంట్‌కు గుంత‌ప‌డి ట్ర‌క్కు ఇరుక్కోవడంతో కొత్త ఎక్స్‌ప్రెస్ వే ద్వారా సెకెన్ల‌లో పాతాళానికి చేరుకోవ‌చ్చంటూ BJPని టార్గెట్ చేస్తోంది.