News September 21, 2024
మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ మృతి
AP: మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ (72) మరణించారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. రేపు విజయవాడలోని మొగల్రాజపురంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1983లో టీడీపీ తరఫున విజయవాడ తూర్పు నుంచి జయప్రకాశ్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు అత్యంత సన్నిహితులు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.
Similar News
News October 10, 2024
పడుకునే ముందు పాలు తాగడం మంచిదేనా?
రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలో సెరోటోనిన్‌ను పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో మంచిగా నిద్ర పడుతుంది. ఉదయం పేగు కదలిక ప్రక్రియ సులభమై మలబద్దకం సమస్య ఉండదు. సంతానోత్పత్తిని పెంచడంలోనూ ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రి పాలు తాగితే కొందరికి లాక్టోస్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా ఉబ్బరం, విరేచనాలు, గ్యాస్ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
News October 10, 2024
దువ్వాడతో నాది పవిత్ర బంధం: మాధురి
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో తనది పవిత్ర బంధం అని దివ్వెల మాధురి చెప్పారు. ప్రజలు తమ మధ్య సంబంధాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్రజా జీవితం వేరు.. రాజకీయాలు వేరు. రెండింటికీ ముడి పెట్టొద్దు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ది తప్పు కాకపోతే మాదీ తప్పు కాదు. ఇక్కడ ఎవరూ రాముడిలాగా ఏకపత్నీవ్రతులు లేరు’ అని ఆమె చెప్పుకొచ్చారు.
News October 10, 2024
మీకు తెలుసా.. ఈ జంతువులు సొంత పిల్లల్నే తినేస్తాయి!
జంతు ప్రపంచంలో నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. కొన్ని జంతువులు సొంత బిడ్డల్నే తినేస్తుంటాయి. తమకు పుట్టని పిల్లల్ని తినేసే మగసింహాలు, ఆహారం దొరక్క మాడిపోతున్న సమయంలో సొంత పిల్లల్ని తినేందుకు వెనుకాడవు. మొసళ్లు, మగ హిప్పోపొటమస్‌లు, చిట్టెలుకలు, ఆక్టోపస్‌లు, పీతలు, కొన్ని జాతుల పాములు కూడా కొన్నిసార్లు వాటి పిల్లల్ని అవే తినేస్తాయి. వినడానికి వింతగా ఉన్నా మనుగడ కోసం జంతు ప్రపంచంలో ఇది సహజమే.