News September 21, 2024

ఎల్లుండి అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, ఇవాళ మరో ఆవర్తనం ఏర్పడనుందని IMD వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదలి ఎల్లుండి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు విస్తారంగా వానలు కురుస్తాయంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మరోవైపు ఈవారంలోనే దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు.

Similar News

News September 21, 2024

భారత్ విజయానికి మరో 6 వికెట్లు

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం లాంఛనంగా కనిపిస్తోంది. 515 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 357 పరుగులు కావాలి. భారత బౌలర్లలో అశ్విన్ 3, బుమ్రా ఒక వికెట్ తీశారు. అంతకుముందు పంత్, గిల్ సెంచరీలతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 287/4 పరుగులకు డిక్లేర్ చేసింది.

News September 21, 2024

దేవుడే నాతో నిజాలు చెప్పించాడేమో: CBN

image

AP:తిరుమల లడ్డూపై తాము డైవర్షన్ <<14149719>>పాలిటిక్స్ <<>>చేస్తున్నామన్న జగన్ వ్యాఖ్యలకు CM చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ‘లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లా? తప్పులు చేసి మళ్లీ బుకాయింపా? పవిత్ర పుణ్యక్షేత్రం విషయాల్లో ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి కదా? మేం వచ్చాక ప్రక్షాళన మొదలుపెట్టాం. ఏ రోజూ ఇవన్నీ బయటకు చెప్పలేదు. కానీ ఆ దేవుడే నాతో దీనిపై మాట్లాడించాడేమో. నిజాలు బయటపెట్టించాడేమో. మనం నిమిత్తమాత్రులం’ అని CM చెప్పారు.

News September 21, 2024

ప్రభాస్ ‘ది రాజాసాబ్’ టీజర్ ఎప్పుడంటే?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ హారర్ కామెడీ మూవీ దాదాపు 50శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సినిమా టీజర్ అక్టోబర్ 23న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసే యోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంది.