News September 21, 2024

ఎల్లుండి అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, ఇవాళ మరో ఆవర్తనం ఏర్పడనుందని IMD వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదలి ఎల్లుండి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు విస్తారంగా వానలు కురుస్తాయంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మరోవైపు ఈవారంలోనే దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు.

Similar News

News October 6, 2024

‘కల్కి’ శాటిలైట్ రైట్స్‌కు మేకర్స్ స్ట్రగుల్స్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా దసరాకు టీవీల్లో వస్తుందనుకున్న వారికి నిరాశే మిగిలేలా కనిపిస్తోంది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కొనుగోలుకు కంపెనీలు ఇంట్రెస్ట్ చూపించట్లేదని సినీవర్గాలు పేర్కొన్నాయి. మేకర్స్ స్టార్ మా గ్రూప్‌ను సంప్రదించగా ధర చూసి వద్దని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. జీ గ్రూప్‌తో చర్చలు జరుపగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం OTTలో రిలీజైంది.

News October 6, 2024

INDvsBAN: భారత్ టార్గెట్ 128 రన్స్

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 127 రన్స్ చేసింది. ఆ జట్టులో మిరాజ్ (35), షాంటో(27) మాత్రమే పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, అర్ష్‌దీప్ 3 వికెట్లతో బంగ్లా నడ్డి విరిచారు. పాండ్య, మయాంక్ యాదవ్, సుందర్ ఒక్కో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 128 రన్స్ చేయాలి.

News October 6, 2024

జట్టుతో ఉన్నప్పుడు స్నాక్స్ బాగా తినొచ్చు: గంభీర్

image

టీమ్ ఇండియా కోచ్‌గా ఉంటే చాలా ప్రయోజనాలుంటాయన్న సంగతి తెలిసిందే. అందులో స్నాక్స్ తినడం కూడా ఒకటని గంభీర్ వెల్లడించారు. ‘ఆడనప్పుడు ఎన్నిసార్లైనా స్నాక్స్ తినొచ్చు’ అంటూ ఇన్‌స్టాలో ఆయన సరదా పోస్ట్ పెట్టారు. తినడమే కాకుండా జట్టుపై కూడా దృష్టి పెట్టండి అంటూ నెటిజన్లు కూడా ఆయనకు సరదా రిప్లైలు ఇస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం ద్రవిడ్ స్థానంలో గంభీర్ కోచ్‌గా వచ్చిన సంగతి తెలిసిందే.