News September 21, 2024

రాజకీయాలొద్దు.. చేతనైతే విచారణ చేయించండి: బొత్స

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో వేగంగా విచారణ జరిపి నిజాలు తేల్చాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవద్దు. చేతనైతే విచారణ జరిపించాలి, అంతేగాని రాజకీయం చేయవద్దు. దేవుడికి అపచారం చేస్తే ఎప్పటికైనా శిక్ష పడుతుంది. ప్రజల మనోభావాలతో రాజకీయాలు సమంజసం కాదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం’ అన్నారు.

Similar News

News September 21, 2024

ఆతిశీ క్యాబినెట్‌లో ఐదుగురికి చోటు

image

ముఖ్య‌మంత్రి ఆతిశీ క్యాబినెట్‌లో ఐదుగురికి చోటు ద‌క్కింది. గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్‌లకు మంత్రి పదవి దక్కింది. LG వీకే స‌క్సేనా వీరితో ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ముకేశ్ అహ్లావ‌త్ మినహా మిగిలిన న‌లుగురు అర‌వింద్ కేజ్రీవాల్ క్యాబినెట్‌లో మంత్రులుగా బాధ్య‌త‌లు నిర్వహించిన వారే కావడం గమనార్హం.

News September 21, 2024

విదేశీ చదువుల ట్రెండ్ మారుతోంది

image

విదేశీ విద్య కోసం US, కెనడా, ఆస్ట్రేలియాను ఎంపిక చేసుకొనే ధోరణికి ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు స్వస్తిపలుకుతున్నారు. ఈ దేశాల కంటే తక్కువ జీవన వ్యయాన్ని, ట్యూషన్ ఫీజులను ఆఫర్ చేస్తున్న యూరోపియన్ దేశాలపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పైగా లిబరల్ లైఫ్‌స్టైల్‌ను కాంక్షిస్తూ దక్షిణాసియా విద్యార్థులు ఎక్కువగా యూరప్‌లో చ‌దివేందుకు, స్థిర‌ప‌డేందుకు ఆస‌క్తి చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

News September 21, 2024

బీఆర్ఎస్ పీఏసీని తుంగలో తొక్కింది: యెన్నం శ్రీనివాస్

image

TG: నిబంధనల ప్రకారమే సీనియర్ సభ్యుడు అరికెపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా నియమించినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడినట్లు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పీఏసీని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. గత పదేండ్లలో జరిగిన ఖర్చులను పీఏసీ తేల్చుతుందని పేర్కొన్నారు.