News September 21, 2024
రాజకీయాలొద్దు.. చేతనైతే విచారణ చేయించండి: బొత్స
AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో వేగంగా విచారణ జరిపి నిజాలు తేల్చాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవద్దు. చేతనైతే విచారణ జరిపించాలి, అంతేగాని రాజకీయం చేయవద్దు. దేవుడికి అపచారం చేస్తే ఎప్పటికైనా శిక్ష పడుతుంది. ప్రజల మనోభావాలతో రాజకీయాలు సమంజసం కాదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం’ అన్నారు.
Similar News
News October 6, 2024
‘కల్కి’ శాటిలైట్ రైట్స్‌కు మేకర్స్ స్ట్రగుల్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా దసరాకు టీవీల్లో వస్తుందనుకున్న వారికి నిరాశే మిగిలేలా కనిపిస్తోంది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కొనుగోలుకు కంపెనీలు ఇంట్రెస్ట్ చూపించట్లేదని సినీవర్గాలు పేర్కొన్నాయి. మేకర్స్ స్టార్ మా గ్రూప్‌ను సంప్రదించగా ధర చూసి వద్దని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. జీ గ్రూప్‌తో చర్చలు జరుపగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం OTTలో రిలీజైంది.
News October 6, 2024
INDvsBAN: భారత్ టార్గెట్ 128 రన్స్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 127 రన్స్ చేసింది. ఆ జట్టులో మిరాజ్ (35), షాంటో(27) మాత్రమే పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, అర్ష్‌దీప్ 3 వికెట్లతో బంగ్లా నడ్డి విరిచారు. పాండ్య, మయాంక్ యాదవ్, సుందర్ ఒక్కో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 128 రన్స్ చేయాలి.
News October 6, 2024
జట్టుతో ఉన్నప్పుడు స్నాక్స్ బాగా తినొచ్చు: గంభీర్
టీమ్ ఇండియా కోచ్‌గా ఉంటే చాలా ప్రయోజనాలుంటాయన్న సంగతి తెలిసిందే. అందులో స్నాక్స్ తినడం కూడా ఒకటని గంభీర్ వెల్లడించారు. ‘ఆడనప్పుడు ఎన్నిసార్లైనా స్నాక్స్ తినొచ్చు’ అంటూ ఇన్‌స్టాలో ఆయన సరదా పోస్ట్ పెట్టారు. తినడమే కాకుండా జట్టుపై కూడా దృష్టి పెట్టండి అంటూ నెటిజన్లు కూడా ఆయనకు సరదా రిప్లైలు ఇస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం ద్రవిడ్ స్థానంలో గంభీర్ కోచ్‌గా వచ్చిన సంగతి తెలిసిందే.