News September 21, 2024
శ్రీవారి లడ్డూ పవిత్రత పునరుద్ధరించాం: TTD

AP: తిరుమల వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదాల పవిత్రతను పునరుద్ధరించినట్లు టీటీడీ తెలిపింది. నందిని డెయిరీ నెయ్యితో తాజాగా లడ్డూలు తయారు చేసినట్లు పేర్కొంది. భక్తుల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ల్యాబ్ రిపోర్టులు కూడా ట్వీట్ చేసింది. కాగా గతంలో వాడిన నెయ్యిలో S వ్యాల్యూ 100కు 19 పాయింట్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాడిన నెయ్యిలో S వ్యాల్యూ 100కు 97 పాయింట్లు ఉండడం విశేషం.
Similar News
News March 15, 2026
గల్ఫ్ దేశాలపై దాడులు చేయొద్దు.. ఇరాన్‌ను కోరిన హమాస్!

గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలని తన మిత్రదేశం ఇరాన్‌ను పాలస్తీనా ఆర్మ్‌డ్ గ్రూప్ హమాస్ కోరింది. ‘పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోవద్దని ఇరాన్ సోదరులను కోరుతున్నాం. ఈ ప్రాంతంలోని దేశాలన్నీ సోదరభావాన్ని కాపాడుకోవడానికి సహకరించాలి’ అని విజ్ఞప్తి చేసింది. US, ఇజ్రాయెల్ దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందని చెప్పింది. యుద్ధాన్ని ఆపేందుకు అన్ని దేశాలు, సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చింది.
News March 15, 2026
ఎండల తీవ్రత.. కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

వేసవిలో కోళ్లకు అందించే దాణా, నీటి పరిమాణం 1:2 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే 1:4 నిష్పత్తిలో ఉండాలి. నీటిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్స్ కలిపితే కోళ్లు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. వీలైనంత వరకు కోళ్లకు ఎండలో ఉండే నీరు కాకుండా చల్లగా ఉండే నీటినే ఇవ్వాలి. కోళ్ల షెడ్లపైన గడ్డి కప్పి, స్ప్రింకర్లు అమర్చి.. షెడ్డు లోపల ఫాగర్స్‌తో ఎండ సమయంలో అరగంటకు ఒకసారి నీరు చల్లాలి.
News March 15, 2026
సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు ఎందుకు?

సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అలాగే ఇంద్రధనస్సులోని 7 రంగులకు సంకేతాలుగానూ చెబుతారు. ఇవి వేదాలలోని 7 ఛందస్సులను కూడా సూచిస్తాయని పండితులు అంటున్నారు. ఈ రథానికి ఉండే ఒకే ఒక్క చక్రం సంవత్సరానికి ప్రతీక. దానిలో ఉండే 12 ఆకులు 12 నెలలకు ప్రతీకలుగా చెబుతారు. సూర్యుని సోదరుడైన అరుణుడు ఈ రథానికి సారథి. సూర్యుని తీవ్రమైన వేడిని ఆయన భరిస్తూ, భూమిపై ప్రాణకోటిని కాపాడతాడు.


