News September 21, 2024

శ్రీవారి లడ్డూ పవిత్రత పునరుద్ధరించాం: TTD

image

AP: తిరుమల వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదాల పవిత్రతను పునరుద్ధరించినట్లు టీటీడీ తెలిపింది. నందిని డెయిరీ నెయ్యితో తాజాగా లడ్డూలు తయారు చేసినట్లు పేర్కొంది. భక్తుల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ల్యాబ్ రిపోర్టులు కూడా ట్వీట్ చేసింది. కాగా గతంలో వాడిన నెయ్యిలో S వ్యాల్యూ 100కు 19 పాయింట్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాడిన నెయ్యిలో S వ్యాల్యూ 100కు 97 పాయింట్లు ఉండడం విశేషం.

Similar News

News October 12, 2024

చంద్రబాబును కలిసి చెక్కులను అందించిన చిరంజీవి

image

మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి రూ.కోటి విరాళం అందజేశారు. తన తరఫున రూ.50 లక్షలు, కుమారుడు రాంచరణ్ తరఫున రూ.50 లక్షల చెక్కులను ముఖ్యమంత్రికి ఇచ్చారు. విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి ఈ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

News October 12, 2024

ఇజ్రాయెల్‌కు సాయం చేయొద్దు.. ఆ దేశాలకు ఇరాన్ హెచ్చరికలు

image

త‌మ‌పై దాడికి ఇజ్రాయెల్‌కు స‌హ‌క‌రిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పొరుగున ఉన్న అర‌బ్ దేశాలు, గ‌ల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాల‌ను ఇరాన్ హెచ్చ‌రించింది. ఇరాన్ దాడి నేప‌థ్యంలో ప్ర‌తీకార దాడి త‌ప్ప‌ద‌ని ఇజ్రాయెల్ ఇప్ప‌టికే స్పష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో త‌మ‌పై దాడికి భూభాగం-గ‌గ‌న‌త‌లం వాడుకునేలా అనుమతిస్తే ప్ర‌తీకారం త‌ప్ప‌ద‌ని ఆయా దేశాలకు ర‌హ‌స్య దౌత్య మాధ్య‌మాల ద్వారా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.

News October 12, 2024

గౌతమ్ గంభీర్‌పై నెటిజన్ల ఆగ్రహం

image

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ ఫ్యాంటసీ క్రికెట్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ చేసిన ట్వీట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. మద్యం, పొగాకు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు తాను వ్యతిరేకమని గంభీర్ గతంలో చెప్పారు. మరి ఇప్పుడు మాట తప్పి డబుల్ స్టాండర్డ్స్ ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైపెచ్చు టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఉన్న వ్యక్తి ఓ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.