News September 22, 2024

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడం లేదా?

image

ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకపోతే మరింత బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయులు తగ్గి టైప్-2 డయాబెటిస్ బారిన పడొచ్చు. మానసిక ఆరోగ్య సమస్యలు, గుండె జబ్బులు కూడా వచ్చే ఆస్కారం ఉంది. మూడు పూటలా తగినంత భోజనం తీసుకోకపోతే శరీరానికి తగినంత పోషకాలు అందవు. ఎంతో కొంత ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఉత్తమం.

Similar News

News March 24, 2026

రూ.10వేలు తగ్గిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర క్రమంగా తగ్గుతోంది. ఇవాళ కేజీ సిల్వర్ రేటు రూ.10,000 పతనమై రూ.2,40,000కు చేరింది. శుభకార్యాల వేళ వారం రోజుల్లోనే కేజీ సిల్వర్ రేటు రూ.40,000 తగ్గి కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పతనమవుతున్న ఈ ధరలు ఇన్వెస్టర్లకు నష్టాలనిస్తున్నాయి.

News March 24, 2026

RDT ఎలా ఏర్పాటైంది? వివాదమేంటి?

image

AP: 1969లో విన్సెంట్ ఫెర్రర్(స్పెయిన్‌) అనంతపురంలో కరవును తరిమికొట్టాలని RDTని స్థాపించారు. విద్య, వైద్యం, నీటి సంరక్షణ, రైతులకు శిక్షణ, స్వయం ఉపాధి, స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సంస్థ ప్రస్తుతం AP, TGలోని 3,500 గ్రామాల్లో సేవలు అందిస్తోంది. విదేశీ నిధులకు కీలకమైన FCRA లైసెన్స్‌ను 2023లో కేంద్రం నిలిపివేయడంతో వివాదం మొదలైంది. తాజాగా దాన్ని <<19461876>>రెన్యువల్<<>> చేసింది.

News March 24, 2026

లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

image

ఇరాన్‌‌తో చర్చలు చేపడతామని ట్రంప్ ప్రకటించడంతో ఈరోజు మార్కెట్లకు ఊరట లభించింది. సెన్సెక్స్ 865 పాయింట్ల లాభంతో 73,571కు చేరగా నిఫ్టీ 275 పాయింట్లు ఎగిసి 22,841 వద్ద ట్రేడవుతోంది. నిన్న చమురు ధరలు తగ్గడం, రూపాయి విలువ కోలుకోవడం, కొనుగోల్లు పెరగడం కలిసొచ్చింది. అయితే ఇరాన్‌పై దాడులు కొనసాగుతుండటంతో క్రూడ్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మార్కెట్ల లాభాలపై పడే అవకాశం ఉంది.