News September 22, 2024
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడం లేదా?

ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకపోతే మరింత బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయులు తగ్గి టైప్-2 డయాబెటిస్ బారిన పడొచ్చు. మానసిక ఆరోగ్య సమస్యలు, గుండె జబ్బులు కూడా వచ్చే ఆస్కారం ఉంది. మూడు పూటలా తగినంత భోజనం తీసుకోకపోతే శరీరానికి తగినంత పోషకాలు అందవు. ఎంతో కొంత ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఉత్తమం.
Similar News
News February 14, 2026
ఏపీ బడ్జెట్.. రంగాల వారీగా

☛ విద్యుత్-రూ.13,934 కోట్లు, ☛ పరిశ్రమలు-₹3,161కోట్లు,
☛ రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులు-₹13,546Cr,
☛ వీబీ జీ రామ్ జీ -₹8,365Cr, ☛ పోలవరం ₹6,105Cr
☛ తల్లికి వందనం ₹9,668Cr, ☛ మహిళా శిశు సంక్షేమం ₹4,581Cr
☛ గృహ నిర్మాణం-₹5,451Cr, ☛ ఎన్టీఆర్ వైద్య సేవ ₹4,000Cr
☛ జల్ జీవన్ ₹4,000Cr, ☛ స్వచ్ఛ్ భారత్ మిషన్ ₹1,037Cr, ☛ విశాఖ ఆర్థిక ప్రాంతానికి ₹28,000Cr , రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు ₹30,000Cr
News February 14, 2026
రూ.3.32లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

AP: 2026-27 ఆర్థిక సంవత్సరానికి మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22,002కోట్లు, ద్రవ్య లోటు రూ.75,868కోట్లుగా పేర్కొన్నారు. అమరావతికి రూ.6వేల కోట్లను కేటాయించారు.
News February 14, 2026
వంటింటి చిట్కాలు మీ కోసం

* పూరీలు తెల్లగా ఉండాలంటే వాటిని వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* ఆలూతో కలిపి నిల్వచేస్తే వెల్లుల్లి తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోవు.


