News September 22, 2024

VIRAL: ఈ ఆటో డ్రైవర్ చాలా స్మార్ట్!

image

ఆన్‌లైన్ పేమెంట్స్ రిసీవ్ చేసుకునేందుకు బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ స్మార్ట్ వాచ్‌లో క్యూఆర్ కోడ్ చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా, ఈయన మరీ అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారంటూ నెటిజన్లు పలు రకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ‘ఇది యూపీఐ స్వాగ్. పేమెంట్స్ చేయడం చాలా ఈజీ’ అని Xలో పోస్ట్ చేశారు.

Similar News

News September 22, 2024

వార్నర్ నటించేది ఈ సినిమాలోనే?

image

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల షూట్‌కు సంబంధించిన ఫొటోలూ వైరలయ్యాయి. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాబిన్‌హుడ్’ సినిమాలోనే ఆయన నటిస్తున్నారని సినీ వర్గాలు తెలిపాయి. అభిమానులకు సర్‌ఫ్రైజ్‌ ఇద్దామని వార్నర్ ఎంట్రీ ప్లాన్ చేసినా ముందుగానే ఫొటోలు లీక్ అయ్యాయని పేర్కొన్నాయి. అంతకుముందు పుష్ప-2లో వార్నర్ నటిస్తారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

News September 22, 2024

అశ్విన్ ‘ది ఆల్ రౌండర్’

image

భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ టెస్టు క్రికెట్లో రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా బంగ్లాదేశ్‌తో ముగిసిన తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ(113)తో అదరగొట్టి, సెకండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీశారు. ఒకే మ్యాచ్‌లో సెంచరీ, 5వికెట్లు తీయడం అశ్విన్‌కిది 4వసారి. ఇయాన్ బోథమ్(5) టాప్‌లో ఉన్నారు. ఒకే వేదికపై(చెన్నై) ఈ ఫీట్ 2సార్లు(2021, 2024) నమోదు చేసిన ఆటగాడు మాత్రం అశ్విన్ ఒక్కరే.

News September 22, 2024

ఇండియా-బీపై ఇండియా-డీ ఘన విజయం

image

దులీప్ ట్రోఫీలో ఇండియా-బీతో జరిగిన మ్యాచులో ఇండియా-డీ 257 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో శాంసన్ సెంచరీ చేయడంతో ఇండియా-డీ 349 పరుగులు చేసింది. మరోవైపు ఇండియా-బీ 282 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్సులో IND-D 305 రన్స్ చేయగా 372 పరుగుల ఆధిక్యం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా-బీ 115 పరుగులకే ఆలౌటైంది. ఇండియా-డీ బౌలర్ అర్షదీప్ సింగ్ 9 వికెట్లు తీశారు.