News September 22, 2024

VIRAL: ఈ ఆటో డ్రైవర్ చాలా స్మార్ట్!

image

ఆన్‌లైన్ పేమెంట్స్ రిసీవ్ చేసుకునేందుకు బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ స్మార్ట్ వాచ్‌లో క్యూఆర్ కోడ్ చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా, ఈయన మరీ అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారంటూ నెటిజన్లు పలు రకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ‘ఇది యూపీఐ స్వాగ్. పేమెంట్స్ చేయడం చాలా ఈజీ’ అని Xలో పోస్ట్ చేశారు.

Similar News

News July 10, 2025

సినిమా ఎఫెక్ట్.. ఇక బ్యాక్ బెంచర్లు ఉండరు!

image

ఫస్ట్ బెంచీ స్టూడెంట్స్ చురుకైనవారని, లాస్ట్ బెంచీ వారు అల్లరివారు, చదువురాదనే ధోరణి ఉంది. దానికి కేరళలోని పాఠశాలలు ‘U సీటింగ్ మోడల్‌’తో చెక్ పెడుతున్నాయి. మలయాళ సినిమా ‘స్థనార్థి శ్రీకుట్టన్’ స్ఫూర్తిగా బ్యాక్‌బెంచర్లు ఉండొద్దని అర్ధ వృత్తాకారంలో విద్యార్థులను కూర్చోబెడుతున్నాయి. ఈ ‘U సీటింగ్’ అసమానతలను తొలగించి, అంతా సమానమనే ఆలోచన తీసుకొస్తుంది. మన దగ్గర ఇలా చేస్తే బాగుంటుంది కదా.

News July 10, 2025

ఎమర్జెన్సీపై శశి థరూర్ సంచలన కథనం

image

1975 ఎమర్జెన్సీని ఉద్దేశించి కాంగ్రెస్ MP శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో పాలన ప్రజలను భయంలోకి నెట్టి, అణచివేతకు గురిచేసిందని ఓ ఆర్టికల్‌లో పేర్కొన్నారు. భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రపంచానికీ తెలియలేదన్నారు. అయినప్పటికీ ఆ చర్యలు జాతీయ ప్రయోజనాల కోసమని అప్పటి నాయకులు చెప్పుకొచ్చారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షకులు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికను ఎమర్జెన్సీ ఇచ్చిందన్నారు.

News July 10, 2025

టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్?

image

TG: ప్రభుత్వ బడుల్లో టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నేడు క్యాబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో ఈ విధానం సక్సెస్ అయిందని అధికారులు తెలిపారు. దీని ద్వారా టీచర్లు టైమ్​కు స్కూల్​కు వస్తారని, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెరుగుతుందని భావిస్తున్నారు.