News September 22, 2024
పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ నారీమణులు

తెలంగాణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. మొత్తం 1.88 కోట్లకు పైగా మహిళలుంటే ప్రతి 1000 మందిలో 3.1 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. MSME పాలసీలో తీసుకున్న వివిధ చర్యలతో Udyam పోర్టల్‌లో 58,644 మంది మహిళా పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకున్నారు. మహిళల నేతృత్వంలోని MSMEల వాటా విషయానికి వస్తే టాప్-3లో తెలంగాణ నిలిచింది.
Similar News
News March 15, 2026
బ్లాక్ మార్కెట్‌లో వంట గ్యాస్ సిలిండర్ రూ.6,500

వంట గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తున్నా అక్రమార్కులు ఆగట్లేదు. NDTV పలు రాష్ట్రాల్లో చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గ్యాస్ సిలిండర్‌కు ₹6,500, 14KGలు రీఫిల్ చేయడానికి ₹3,500-₹4K వరకు తీసుకుంటున్నారు. స్టవ్ రిపేర్ సెంటర్లు, కిరాణా దుకాణాల ద్వారా ఈ రాకెట్ నడుపుతున్నారు. ఏజెన్సీలే వీరికి బ్లాక్‌లో గ్యాస్ ఇస్తున్నట్లు తేలింది.
News March 15, 2026
ఏలూరు ఎంపీకి డ్రగ్స్ పాజిటివ్: ఎస్పీ

TG: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌కు పాజిటివ్ వచ్చినట్లు ‘ఈగల్’ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. నిన్న యూరిన్ టెస్టు చేయగా <<19386182>>నెగటివ్<<>> వచ్చిందని, ఈరోజు టెస్టు చేయగా కొకైన్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. FIRలో మొత్తం 11 మంది పేర్లను చేర్చారు.
News March 15, 2026
Viral: రూ.60వేలతో రూ.25 కోట్లు!

ఆదిలాబాద్‌లో 1990ల్లో కొన్న భూమి కనక వర్షం కురిపించిందని ఓ వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘ఆదిలాబాద్‌లో మా అంకుల్ ఎకరానికి రూ.15వేల చొప్పున 4 ఎకరాలు కొన్నారు. అంటే రూ.60వేలు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆ పట్టణం అభివృద్ధి చెందింది. డీమార్ట్ రూ.25 కోట్లు ఇచ్చి 2 ఎకరాలను కొనుగోలు చేసింది. ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయగా నెలకు వడ్డీ కింద రూ.14.5 లక్షలు వస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.


