News September 22, 2024

ఈ హ్యాండిల్‌తోనే ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్స్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ‘గేమ్ ఛేంజర్’ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ ట్విటర్‌లో ‘GameChangerOffl’ అనే అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఈ అకౌంట్‌లో త్వరలోనే అదిరిపోయే అప్డేట్‌ రాబోతోందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. కాగా, సెకండ్ సింగిల్ విడుదల అవుతుందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Similar News

News November 10, 2025

రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం

image

AP: రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి, ఏపీ నైబర్ హుడ్ పాలసీ, డ్రోన్ సిటీ భూ కేటాయింపు పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖలో ఐటీ కంపెనీలకు రోడ్డు విస్తరణకు నిర్ణయం తీసుకుంది. విశాఖలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ఐటీ క్యాంపస్‌కు 2 ఎకరాలు, ఫ్లూయెంట్ గ్రిడ్ ఐటీ క్యాంపస్‌కు 3.3 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది.

News November 10, 2025

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం, NHAIకి SC నోటీసులు

image

ఇటీవల TG, రాజస్థాన్‌లలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీం కోర్టు విచారించింది. NHల నిర్వహణపై నివేదిక ఇవ్వాలని కేంద్రం, NHAIని ఆదేశించింది. రోడ్లపై వాహనాల పార్కింగ్ వల్లే ఈ ప్రమాదాలని జస్టిస్ JK మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిలో ఆయా రాష్ట్రాల CSలనూ పార్టీగా చేర్చాలని పేర్కొంది. రోడ్డు ప్రమాదాల్లో TGలో 19మంది, రాజస్థాన్‌లో 18మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.

News November 10, 2025

ధర్మేంద్ర హెల్త్‌పై రూమర్స్.. టీమ్ క్లారిటీ

image

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ <<18162519>>ధర్మేంద్ర<<>> ఇటీవల శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందని, మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది. వాటిని నటుడి టీమ్ ఖండించింది. ‘ఆయన కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముంబైలోని ఆస్పత్రికి రొటీన్ చెకప్‌కు వెళ్లగా ఇలాంటి వార్తలు వచ్చాయి’ అని క్లారిటీ ఇచ్చారు.