News September 22, 2024
ఈ హ్యాండిల్‌తోనే ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ‘గేమ్ ఛేంజర్’ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ ట్విటర్‌లో ‘GameChangerOffl’ అనే అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఈ అకౌంట్‌లో త్వరలోనే అదిరిపోయే అప్డేట్ రాబోతోందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. కాగా, సెకండ్ సింగిల్ విడుదల అవుతుందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Similar News
News October 13, 2024
విమానాల్లో పేజర్లు, వాకీటాకీలపై ఇరాన్ నిషేధం
ప్రతీకార దాడులు తప్పవన్న ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ జాగ్రత్తపడుతోంది. హెజ్బొల్లా పేజర్ల పేలుళ్ల తరహా ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా ఇరాన్ విమానయాన శాఖ వీటిపై నిషేధం విధించింది. ప్రయాణికులు మొబైల్ ఫోన్లు మినహా పేజర్లు, వాకీటాకీలను విమాన క్యాబిన్‌లో, చెక్-ఇన్‌లో తీసుకెళ్లలేరు. దుబాయ్ నుంచి వచ్చి, వెళ్లే విమానాల్లో సహా దుబాయ్ మీదుగా వెళ్లే విమానాల్లో ఈ నిషేధాన్ని విధించారు.
News October 13, 2024
ప్రభుత్వానిదే బాధ్యత.. సిద్దిఖీ హత్యపై రాహుల్
MH మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాహుల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్దిఖీ కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఈ హత్య ఘటన MHలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమని రాహుల్ పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. సిద్దిఖీ హత్య బాలీవుడ్ చిత్రసీమలోనూ తీవ్ర విషాదం మిగిల్చింది.
News October 13, 2024
భారీ వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక
ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలతో విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. వర్షాలకు వాగులు, కాలువలు పొంగే అవకాశం ఉందని, పిడుగులు పడొచ్చని తెలిపింది. రైతులు, గొర్రెలకాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. అత్యవసరమైతే 1070, 112, 1080-425-0101 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపింది.