News September 22, 2024

ALERT.. కాసేపట్లో పిడుగులు, వర్షాలు

image

TG: మరికాసేపట్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. 1-2 గంటల్లో తూర్పు హైదరాబాద్‌లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. మెదక్, వనపర్తిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Similar News

News September 22, 2024

చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌

image

చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారిగా స్వర్ణాన్ని గెలుచుకుని భారత్ చరిత్ర లిఖించింది. స్లోవేనియాతో జరిగిన చివరి రౌండ్‌లో వ్లాదిమిర్ ఫెదోసీవ్‌ను గుకేశ్, ఇరిగేశీ జాన్ సుబెల్జ్‌ను అర్జున్ ఓడించారు. దీంతో ఇండియాకు స్వర్ణం ఖాయమైంది. అటు అమ్మాయిల బృందం కూడా స్వర్ణం గెలవడంతో భారత్‌కు ‘ఒలింపియాడ్ డబుల్‌’ సొంతమైంది.

News September 22, 2024

దేవుడికి అపచారాలు చేసి మళ్లీ ఎదురుదాడా?: సీఎం

image

AP: గత పాలకులు తిరుమలలో చేసిన అపచారాన్ని ప్రజలు మర్చిపోరని CM చంద్రబాబు అన్నారు. ‘అన్యమతస్థులు కొండపై వ్యాపారాలు చేశారు. క్రిస్టియన్ సంప్రదాయంలో కుమార్తె పెళ్లి చేసిన భూమన కరుణాకర్‌రెడ్డిని TTD ఛైర్మన్‌ను చేశారు. కుమారుడు చనిపోతే EO ధర్మారెడ్డి కొండపైకి వెళ్లారు. దేవుడికి ఇలాంటి అపచారాలు చేసి మళ్లీ ఎదురుదాడి చేస్తారా? ‘ అని CM ప్రశ్నించారు. అపచారాలు చేసి కూడా YCP నేతలు పశ్చాత్తాపం పడటం లేదన్నారు.

News September 22, 2024

శ్రీలంక అధ్యక్షుడిగా దిసనాయకే

image

శ్రీలంక అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత, నేషనల్ పీపుల్స్ పవర్ అభ్యర్థి అనుర కుమార దిసనాయకే ఎన్నికయ్యారు. విపక్ష నేత సాజిత్ ప్రేమదాస రెండో స్థానానికి పరిమితమయ్యారు. దిసనాయకేకు 42.31 శాతం ఓట్లు రాగా, ప్రేమదాసకు 32.76 శాతం ఓట్లు వచ్చాయి. వీరిద్దరి మధ్య దాదాపు 10 లక్షల ఓట్ల తేడా ఉన్నట్లు తెలుస్తోంది. 17.27 శాతం ఓట్లతో రణిల్ మూడో స్థానంలో నిలిచారు.