News September 22, 2024
ALERT.. కాసేపట్లో పిడుగులు, వర్షాలు
TG: మరికాసేపట్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. 1-2 గంటల్లో తూర్పు హైదరాబాద్‌లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. మెదక్, వనపర్తిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Similar News
News October 5, 2024
ఆన్‌లైన్ బెట్టింగ్.. 2 కుటుంబాలు బలి
ఆన్‌లైన్ బెట్టింగ్ కుటుంబాల్లో విషాదం నింపుతోంది. తెలంగాణలోని వడ్డేపల్లి(నిజామాబాద్)లో హరీశ్ అనే యువకుడు రూ.50 లక్షలకుపైగా కోల్పోయాడు. పేరెంట్స్ పొలం అమ్మినా అప్పు తీరకపోవడంతో ముగ్గురూ ఉరివేసుకున్నారు. ఏపీలోని గంగాధర నెల్లూరు(చిత్తూరు)లో దినేశ్ రూ.కోటి పోగొట్టుకున్నాడు. ఆ మొత్తాన్ని తీర్చలేక తల్లిదండ్రులు, అక్కతోపాటు పురుగుమందు తాగాడు. పేరెంట్స్ చనిపోగా, అక్క, సోదరుడు చికిత్స పొందుతున్నారు.
News October 5, 2024
TENTH: రెండు రోజులపాటు సైన్స్ ఎగ్జామ్
TG: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జనరల్ సైన్స్ పేపర్‌ను రెండు రోజులపాటు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను ఇప్పటివరకు ఒకే రోజు నిర్వహిస్తూ వచ్చారు. ఇక నుంచి వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పేపర్‌కు ఎప్పటిలాగే 1.30hrs సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత టెన్త్ పేపర్లను 11నుంచి 6కు కుదించిన సంగతి తెలిసిందే.
News October 5, 2024
WARNING: ఈ నంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దు!
పాకిస్థాన్ నుంచి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. +92తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దంటున్నారు. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫొటోలను డీపీగా పెట్టుకుని చీట్ చేస్తారని, నమ్మితే మోసపోతారని హెచ్చరిస్తున్నారు. ఆగ్రాకు చెందిన ఓ మహిళను ఇలాగే మోసగించడంతో <<14268213>>ఆమె<<>> గుండెపోటుతో మరణించింది. >>SHARE IT