News September 22, 2024

చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌

image

చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారిగా స్వర్ణాన్ని గెలుచుకుని భారత్ చరిత్ర లిఖించింది. స్లోవేనియాతో జరిగిన చివరి రౌండ్‌లో వ్లాదిమిర్ ఫెదోసీవ్‌ను గుకేశ్, ఇరిగేశీ జాన్ సుబెల్జ్‌ను అర్జున్ ఓడించారు. దీంతో ఇండియాకు స్వర్ణం ఖాయమైంది. అటు అమ్మాయిల బృందం కూడా స్వర్ణం గెలవడంతో భారత్‌కు ‘ఒలింపియాడ్ డబుల్‌’ సొంతమైంది.

Similar News

News December 28, 2025

Viral Photo: ఒకే ఫ్రేమ్‌లో రామ్‌ చరణ్, ధోనీ, సల్మాన్

image

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, క్రికెట్ లెజెండ్ MS ధోనీ, నటుడు బాబీ డియోల్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో SMలో వైరల్‌ అవుతోంది. నిన్న సల్మాన్ ఖాన్ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు చరణ్ హాజరైనట్లు తెలుస్తోంది. ఈ అరుదైన ఫొటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. కాగా ఈ ముగ్గురి మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు వీరు కలిసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.

News December 28, 2025

సభా సమయం.. వేడెక్కిన రాజకీయం!

image

TG: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేతల కామెంట్లతో రాజకీయం వేడెక్కింది. సభలో ప్రభుత్వం హుందాగా ప్రవర్తిస్తుందని, ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అటు ఎన్నిరోజులైనా సభను నడుపుతామని చెప్పే ప్రభుత్వం ఒక్కరోజుతో సమావేశాలు ముగించేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కనీసం 15రోజులైనా సభను నడపాలని ఆయన డిమాండ్ చేశారు.

News December 28, 2025

జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండాలంటే?

image

జ్ఞాపకశక్తి బాగుండాలంటే మెదడుకూ వ్యాయామం అవసరం అంటున్నారు నిపుణులు. దీనికోసం రోజూ ధ్యానం చెయ్యడం, పజిల్స్‌ నింపడం, పుస్తకపఠనం, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం మంచిదని సూచిస్తున్నారు. మెదడును ఎప్పుడూ చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలి. దీంతో పాటు రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి మెదడు పనితీరు బాగుంటుంది. జ్ఞానసంబంధమైన సామర్థ్యం పెరుగుతుందంటున్నారు.