News September 22, 2024
చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్
చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారిగా స్వర్ణాన్ని గెలుచుకుని భారత్ చరిత్ర లిఖించింది. స్లోవేనియాతో జరిగిన చివరి రౌండ్‌లో వ్లాదిమిర్ ఫెదోసీవ్‌ను గుకేశ్, ఇరిగేశీ జాన్ సుబెల్జ్‌ను అర్జున్ ఓడించారు. దీంతో ఇండియాకు స్వర్ణం ఖాయమైంది. అటు అమ్మాయిల బృందం కూడా స్వర్ణం గెలవడంతో భారత్‌కు ‘ఒలింపియాడ్ డబుల్’ సొంతమైంది.
Similar News
News October 10, 2024
ఆయూష్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
AP: బీఏఎంఎస్, BHMS, BUMS కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ యూజీ-2024లో అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీలోపు వర్సిటీ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలంది. ఇటు MBBS మేనేజ్‌మెంట్ కోటాలో చేరిన విద్యార్థులు ఈ నెల 14తేదీ లోపు ఫ్రీఎగ్జిట్ అవ్వొచ్చని తెలిపింది. దివ్యాంగ కోటాలో కన్వీనర్ సీట్లు పొందిన వారు ఈ నెల 11లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలంది.
News October 10, 2024
పల్లె పండుగ పనులపై మార్గదర్శకాలు జారీ
AP: పల్లె పండుగ పేరిట పంచాయతీల్లో ఈ నెల 14- 20వ తేదీ వరకు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పనులను JAN నెలాఖరులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం నిబంధనలకు అనుగుణంగా పనులు నిర్వహించాలంది. జియో ట్యాగింగ్ సహా అన్ని వివరాలను పీఆర్ వన్ యాప్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించింది. సోషల్ ఆడిట్ అనంతరం బిల్లులు చెల్లిస్తామంది.
News October 10, 2024
రతన్ టాటా ‘లవ్ స్టోరీ’ తెలుసా?
రతన్ టాటా జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. అయితే ఆయనకు ఓ ప్రేమకథ ఉంది. USలో ఉన్నప్పుడు ఓ యువతితో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ, ఆ సమయంలో రతన్ టాటా వ్యక్తిగత కారణాలతో భారతదేశానికి రావాల్సి వచ్చింది. అదే సమయంలో భారత్-చైనా యుద్ధం జరగడంతో ఆ యువతిని ఆమె తల్లిదండ్రులు భారత్ రావడానికి అనుమతించలేదు. దీంతో ఆ ప్రేమకథ పెళ్లిపీటలు ఎక్కలేదని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.