News September 23, 2024

మద్యం ధరలు తగ్గించి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు?: VSR

image

AP: కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘మెడిసిన్స్ లేదా విద్యా సంస్థల ఫీజులను తగ్గించకుండా, మద్యం ధరను(₹99/180ml) తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మద్యపానాన్ని, గృహ హింసను పెంచుతుంది. ప్రజారోగ్యాన్ని మరింత దిగజారుస్తుంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలపై సందేహం కలుగుతోంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 23, 2024

దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే

image

TG: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. అక్కడ హైడ్రా కూల్చివేతలు చేపట్టవద్దని కోర్టు స్టే ఇచ్చింది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నివాసితులు హాజరు కావాలని ఆదేశించింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి 6 వారాల్లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పింది.

News September 23, 2024

రూ.30 కోట్లు రాబట్టిన ‘మత్తు వదలరా-2’

image

శ్రీసింహా కోడూరి, క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మత్తు వదలరా-2’ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. పదిరోజుల్లో ఈ సినిమాకు రూ.30.1 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతోపాటు అమెరికాలోనూ $1 మిలియన్ దాటేసినట్లు తెలిపారు. ఈ సినిమాను రితేశ్ రాణా తెరకెక్కించారు.

News September 23, 2024

10 మంది MLAలకు హైకోర్టు నోటీసులు

image

TG: ఇటీవల పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.