News September 23, 2024

మద్యం ధరలు తగ్గించి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు?: VSR

image

AP: కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘మెడిసిన్స్ లేదా విద్యా సంస్థల ఫీజులను తగ్గించకుండా, మద్యం ధరను(₹99/180ml) తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మద్యపానాన్ని, గృహ హింసను పెంచుతుంది. ప్రజారోగ్యాన్ని మరింత దిగజారుస్తుంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలపై సందేహం కలుగుతోంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 11, 2024

15న నేవీ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన

image

TG: వికారాబాద్ జిల్లా పరిగిలోని దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఈ నెల 15న శంకుస్థాపన జరగనుంది. CM రేవంత్ రెడ్డి, మంత్రి సురేఖలను కలిసి రాడార్ స్టేషన్ ప్రాజెక్టు అధికారులు శంకుస్థాపనకు ఆహ్వానించారు. దేశంలోనే 2వ రాడార్ స్టేషన్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వస్తుందని మంత్రి సురేఖ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అటు ఈ స్టేషన్ వద్దంటూ వామపక్షాలు, ప్రజాసంఘాలు ఇటీవల ఆందోళన చేశాయి.

News October 11, 2024

ప్రయాణికులకు ‘దసరా’ షాక్

image

AP: దసరాకు నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ దోచేస్తున్నాయి. ఇవాళ నాన్ AC బస్సుల్లో అదనంగా ₹700-1,000, AC బస్సుల్లో ₹1,000-2,000 వరకు గుంజుతున్నాయి. ఆదివారం తిరుగు ప్రయాణానికి రెండింతల రేట్లు పెంచేశాయి. ఉదా. HYD నుంచి కడపకు టికెట్ ధర ₹1,000 ఉండగా, ఇప్పుడు ₹2,000-3,000 లాగుతున్నాయి. ప్రత్యక్షంగానే దోపిడీ కనపడుతున్నా రవాణా శాఖ పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి.

News October 11, 2024

నీటి పారుదల శాఖకు రూ.284 కోట్లు విడుదల

image

AP: జలవనరుల ప్రాజెక్టుల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల కోసం నీటిపారుదల శాఖకు రూ.284.04 కోట్లు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఈ నిధులు విడుదల చేసింది. దీంతో కాలువలు, ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు వంటివి చేయనున్నారు. అంతకుముందు రూ.310 కోట్లతో ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ అంచనా వ్యయాన్ని పంపింది.