News September 23, 2024
‘పుష్ప-2’ నుంచి స్పెషల్ పోస్టర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరో 75 రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా.. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 6న ‘పుష్ప-2’ రిలీజ్ కానుంది.
Similar News
News August 31, 2025
పుజారాను మెచ్చుకుంటూ మోదీ లేఖ

అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు <<17502622>>పుజారా<<>> వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తన రిటైర్మెంట్‌పై స్పందిస్తూ PM మోదీ లేఖ రాసినట్లు పుజారా వెల్లడించారు. ఆయన పంపిన లేఖను SMలో పంచుకున్నారు. సౌరాష్ట్రతో అనుబంధం మొదలు AUSలో డేంజరస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించడం వరకు ప్రతి అంశాన్ని ఆ లేఖలో పేర్కొన్నారు. పుజారా కుటుంబం చేసిన త్యాగాలనూ ప్రస్తావించారు. తనకు లేఖ రాయడంపై మోదీకి పుజారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News August 31, 2025
మహిళలకు ఫ్రీ బస్సు.. పురుషుల డిమాండ్స్ ఇవీ!

AP, TGలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని పురుషులు వాపోతున్నారు. ఇటీవల విజయనగరంలో ఓ బస్సులో మహిళ పురుషుడిపై <<17552607>>దాడి<<>> చేయడం చర్చనీయాంశంగా మారింది. డబ్బులు కట్టి నిలబడి వెళ్లాల్సి వస్తోందని, లాస్ట్ సీటు వరకు మహిళలే కూర్చుంటున్నారని చెబుతున్నారు. పురుషులకు సీట్లు కేటాయించాలని లేదంటే తమకు స్పెషల్ బస్సులు వేసి, ఛార్జీలు తగ్గించాలంటున్నారు. మీ కామెంట్?
News August 31, 2025
‘ప్రాణహిత-చేవెళ్ల’తో రూ.60 వేల కోట్లు మిగిలేవి: మంత్రి ఉత్తమ్

TG: రూ.38,500 కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి ఉంటే 16.50 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో అన్నారు. ‘ఆ ప్రాజెక్టుతో రూ.60వేల కోట్లు ఆదా అయ్యేవి. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, దేవాదుల, సీతారాంసాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. ఇప్పటివరకు కాళేశ్వరం నీటిని ఎత్తిపోసినందుకు ఇరిగేషన్ శాఖ విద్యుత్ శాఖకు రూ.9,738 కోట్లు చెల్లించాల్సి ఉంది’ అని తెలిపారు.