News September 23, 2024

‘పుష్ప-2’ నుంచి స్పెషల్ పోస్టర్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరో 75 రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా.. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 6న ‘పుష్ప-2’ రిలీజ్ కానుంది.

Similar News

News October 4, 2024

పెళ్లి సందడి.. ఈ సీజన్‌లో 48 లక్షల పెళ్లిళ్లు!

image

రెండు నెలల విరామం తర్వాత నవంబర్ 12 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవనుంది. 45రోజుల పాటు సాగే ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. వీటికోసం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు భారతీయులు సిద్ధమవుతున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సర్వే పేర్కొంది. ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల పెళ్లిళ్ల ద్వారా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగనుందని తెలిపింది.

News October 4, 2024

కేంద్రం ఇప్పటికీ ఆ నిధులు ఇవ్వలేదు: సీఎం పినరయి

image

వయనాడ్ జిల్లాలో కొండచ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో పున‌రావాసం కోసం కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందించలేదని CM పిన‌ర‌యి విజ‌య‌న్ తెలిపారు. ఈ ప్రాంతంలో PM మోదీ త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నిధుల కొర‌త ఉండ‌ద‌ని చెప్పార‌న్నారు. అయితే, ఈ ఏడాది రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి కేంద్ర కేటాయింపుల‌తో పాటు అత్యవసర సహాయం ₹219 కోట్లు కోరినట్టు తెలిపారు. మరోసారి ఆర్థిక సాయానికి విజ్ఞప్తి చేస్తామ‌న్నారు.

News October 4, 2024

వైసీపీ కార్యకర్తలు తిరగబడితే కూటమి నేతలు కొట్టుకుపోతారు: పేర్ని నాని

image

AP: వైసీపీ కార్యకర్తలంతా కలిసి కట్టుగా ఉండాలని మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తలు తిరగబడితే కూటమి నేతలు కొట్టుకుపోతారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వారికి సూచించారు. చంద్రబాబులా జగన్‌కు మద్దతు అవసరం లేదని, ఆయన ఒంటరిగా వస్తారని చెప్పారు.