News September 23, 2024

BREAKING: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

image

AP: న్యాయశాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. త్వరలో మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. అటు అమరావతిలో 100 ఎకరాల్లో ఇంటర్నేషనల్ లా కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వాలని ఆదేశించారు.

Similar News

News January 25, 2026

టీమ్ ఇండియా ఘన విజయం

image

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించింది. సంజూ డకౌటైనా అభిషేక్(68*), సూర్యకుమార్(57*) ధాటిగా ఆడారు. పవర్ ప్లే ముగిసేలోపే అభిషేక్ ఫిఫ్టీ నమోదు చేశారు. ఇషాన్(28) సైతం ధనాధన్ ఇన్నింగ్సు ఆడారు. ఈ విజయంతో 5 T20Iల సిరీస్‌ను 3-0తో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. మరో 2 టీ20లు నామమాత్రం కానున్నాయి.

News January 25, 2026

అభిషేక్ శర్మ ఊచకోత..

image

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నారు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. భారత్ తరఫున టీ20లలో ఇదే సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. తొలి స్థానంలో అభిషేక్ గురువు యువరాజ్(12 బంతుల్లోనే అర్ధ సెంచరీ) ఉన్నారు.

News January 25, 2026

చెప్పింది 3 వేలు.. అసలు లెక్క 30 వేలు!

image

ఇరాన్ నిరసనల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. జనవరి 8, 9వ తేదీల్లోనే దాదాపు 30 వేల మంది మృతి చెందినట్లు USకు చెందిన TIME మ్యాగజైన్ వెల్లడించింది. ప్రభుత్వం ప్రకటించిన 3,117 మరణాల కంటే హాస్పిటల్‌ రికార్డులు, స్థానిక అధికారులు, వైద్యులు తెలిపిన సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది. సుమారు 4,000 ప్రాంతాల్లో నిరసనలు జరగగా ఇంటర్నెట్ ఆపేయడం వలన వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియలేదని పేర్కొంది.