News September 23, 2024

BREAKING: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

image

AP: న్యాయశాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. త్వరలో మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. అటు అమరావతిలో 100 ఎకరాల్లో ఇంటర్నేషనల్ లా కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వాలని ఆదేశించారు.

Similar News

News October 10, 2024

‘సదరం’ స్లాట్ బుకింగ్ ప్రారంభం

image

AP: అంగ వైకల్య నిర్ధారణ పరీక్షలకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. డిసెంబర్ వరకు ఇవి కొనసాగుతాయని చెప్పారు. మీసేవ, గ్రామ-వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

News October 10, 2024

రతన్ టాటా అందుకున్న పురస్కారాలు

image

రతన్ టాటా తన జీవిత కాలంలో స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ అనేక గౌరవ పురస్కారాలను అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే మెడల్, అంతర్జాతీయ విశిష్ఠ సాఫల్య పురస్కారం, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ గ్రాండ్ ఆఫీసర్ అవార్డు, నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్(UK), ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు వంటి అవార్డులు, అనేక డాక్టరేట్లు తన ఖాతాలో ఉన్నాయి.

News October 10, 2024

నేడు క్యాబినెట్ భేటీ

image

AP: ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం కానుంది. చెత్త పన్ను రద్దు, కొత్త మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీ, దేవాలయాలకు పాలక మండళ్ల నియామకం, ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి అంశాలపై చర్చించే అవకాశముంది.