News September 23, 2024

AIలో భద్రతా లోపాలు పెనుసవాలే!

image

OpenAI GPT, Google జెమిని, Meta LLaMA వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)లోని భద్రతా లోపాలు, మానవ ఆలోచనా విధానంపై వాటి అవగాహనలేమి ప్రపంచ భ‌ద్ర‌త‌కు పెనుస‌వాలుగా పరిణమిస్తున్నాయి. హానికర AI మోడల్స్‌ టెర్రరిజం, సైబర్, ఆర్థిక నేరాలు, మాల్వేర్, త‌ప్పుడు స‌మాచార సృష్టి, మాదకద్రవ్యాలు-ఆయుధాల తయారీ వంటి కార్యకలాపాల్లో సహాయపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Similar News

News September 24, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: సెప్టెంబర్ 24, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:05 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:08 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:29 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:10 గంటలకు
✒ ఇష: రాత్రి 7.22 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 24, 2024

భారత క్రికెట్‌కు బుమ్రా ఓ కోహినూర్: అశ్విన్

image

భారత క్రికెటర్లలో అత్యంత ఫిట్‌ ప్లేయర్ తానేనని బుమ్రా అనడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇతర క్రికెటర్ల ఫ్యాన్స్ అతడిని ట్రోల్ చేశారు. ఈ విషయంపై భారత స్పిన్నర్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘బుమ్రా మన క్రికెట్‌లో కోహినూర్ వజ్రం. భారత జట్టు కిరీటంలో కలికితురాయి. తను అత్యంత విలువైన ఆటగాడు. అతడేమన్నా పర్వాలేదు. తన ఇష్టం. అవన్నీ మేం అంగీకరిస్తాం’ అని స్పష్టం చేశారు.

News September 24, 2024

‘లాపతా లేడీస్‌’ టీమ్‌కు ప్రశాంత్ వర్మ అభినందనలు

image

ఈ ఏడాది భారత్ నుంచి ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ అయిన ‘లాపతా లేడీస్’ టీమ్‌కు హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్యులేషన్స్ కిరణ్ రావు అండ్ టీమ్. కొత్త తరహా కథల్ని చెప్పాలన్న మీ నిబద్ధత ఆ సినిమాలో కనిపించింది. ఆస్కార్లలోనూ మీ సినిమా రాణించాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. ‘లాపతా లేడీస్’ తన సినిమా హను-మాన్‌ను దాటి ఎంపికైనప్పటికీ ఆ మూవీ టీమ్‌కు ఆయన బెస్ట్ విషెస్ చెప్పడం విశేషం.