News September 23, 2024
AIలో భద్రతా లోపాలు పెనుసవాలే!
OpenAI GPT, Google జెమిని, Meta LLaMA వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)లోని భద్రతా లోపాలు, మానవ ఆలోచనా విధానంపై వాటి అవగాహనలేమి ప్రపంచ భద్రతకు పెనుసవాలుగా పరిణమిస్తున్నాయి. హానికర AI మోడల్స్ టెర్రరిజం, సైబర్, ఆర్థిక నేరాలు, మాల్వేర్, తప్పుడు సమాచార సృష్టి, మాదకద్రవ్యాలు-ఆయుధాల తయారీ వంటి కార్యకలాపాల్లో సహాయపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News October 12, 2024
ఆ విషయంలో భాగస్వామి వద్దకు కాకపోతే ఇంకెవరి వద్దకు వెళ్తారు: హైకోర్టు
నైతిక నాగరిక సమాజంలో ఒక వ్యక్తి (M/F) శారీరక, లైంగిక కోరికలను తీర్చుకోవడానికి భాగస్వామి వద్దకు కాకుండా ఇంకెవరి దగ్గరకు వెళ్తారని అలహాబాద్ హైకోర్టు ప్రశ్నించింది. భర్తపై పెట్టిన వరకట్నం కేసులో భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసు కొట్టేసింది. ఈ కేసు ఇద్దరి మధ్య లైంగిక సంబంధ అంశాల్లో అసమ్మతి చుట్టూ కేంద్రీకృతమైనట్టు పేర్కొంది.
News October 12, 2024
చంద్రబాబును కలిసి చెక్కులను అందించిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి రూ.కోటి విరాళం అందజేశారు. తన తరఫున రూ.50 లక్షలు, కుమారుడు రాంచరణ్ తరఫున రూ.50 లక్షల చెక్కులను ముఖ్యమంత్రికి ఇచ్చారు. విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి ఈ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
News October 12, 2024
ఇజ్రాయెల్‌కు సాయం చేయొద్దు.. ఆ దేశాలకు ఇరాన్ హెచ్చరికలు
తమపై దాడికి ఇజ్రాయెల్‌కు సహకరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పొరుగున ఉన్న అరబ్ దేశాలు, గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ దాడి నేపథ్యంలో ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమపై దాడికి భూభాగం-గగనతలం వాడుకునేలా అనుమతిస్తే ప్రతీకారం తప్పదని ఆయా దేశాలకు రహస్య దౌత్య మాధ్యమాల ద్వారా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.