News September 23, 2024

టెట్ హాల్ టికెట్లలో తప్పులు.. అధికారులు ఏమన్నారంటే?

image

AP: టెట్ హాల్ టికెట్లలో ఏమైనా తప్పులుంటే వాటిని పరీక్ష కేంద్రాల వద్ద సరిచేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. తాజాగా హాల్ టికెట్లు రిలీజ్ చేయగా కొందరికి ఒకే రోజు వేర్వేరు చోట్ల పరీక్షా కేంద్రాలు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అవసరమైతే అభ్యర్థులు సర్టిఫికెట్లు చూపించి సరిచేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఏమైనా సందేహాలుంటే ఫోన్/మెయిల్ ద్వారా పంపవచ్చని చెప్పారు.

Similar News

News December 30, 2024

60 మంది బెస్ట్ యాక్టర్స్.. ఇండియా నుంచి ఒక్కరే

image

ప్రపంచవ్యాప్తంగా 21వ శతాబ్దపు 60 మంది బెస్ట్ యాక్టర్ల జాబితాను యూకేకు చెందిన ‘ది ఇండిపెండెంట్’ పత్రిక విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి ఇర్ఫాన్ ఖాన్ ఒక్కరినే చేర్చింది. ఆయనకు 41వ ర్యాంక్ ఇచ్చింది. 1988లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇర్ఫాన్ 100కు పైగా చిత్రాల్లో నటించారు. పాన్ సింగ్ థోమర్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు, అనేక చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను పొందారు. ఈయన 2020లో చనిపోయారు.

News December 30, 2024

రేపు అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు

image

TG: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు సేవలందించనున్నాయి. రాత్రి గం.12:30కి చివరి రైలు బయల్దేరుతుందని HMRL వర్గాలు వెల్లడించాయి. అర్థరాత్రి వరకు వేడుకలు ఉండటంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా జరిగే అవకాశం ఉండటంతో సేఫ్‌గా ఇంటికి చేరేందుకు ఇది సహకరించనుంది. ఇక నగరంలో రేపు రాత్రి ఫ్లై ఓవర్లు మూసేస్తామని పోలీసులు తెలిపారు.

News December 30, 2024

ఉక్రెయిన్‌కి భారీ సైనిక సాయం ప్రకటించిన బైడెన్

image

ర‌ష్యాతో త‌ల‌ప‌డుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ 2.5 బిలియన్‌ డాలర్ల భారీ సైనిక సాయాన్ని ప్ర‌క‌టించారు. ఉక్రెయిన్ సైన్యానికి అవ‌స‌ర‌మైన త‌క్ష‌ణ సామాగ్రిని అందించేందుకు 1.25 బిలియన్‌ డాలర్ల డ్రాడౌన్ ప్యాకేజీ, 1.22 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాల స‌ర‌ఫ‌రాకు ఆమోదం తెలిపారు. ర‌ష్యాను నిలువ‌రించే ప్ర‌య‌త్నాల్లో ఉక్రెయిన్‌కు అండ‌గా ఉండ‌డం త‌న ప్రాధాన్యమని బైడెన్ పేర్కొన్నారు.