News September 23, 2024
టెట్ హాల్ టికెట్లలో తప్పులు.. అధికారులు ఏమన్నారంటే?
AP: టెట్ హాల్ టికెట్లలో ఏమైనా తప్పులుంటే వాటిని పరీక్ష కేంద్రాల వద్ద సరిచేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. తాజాగా హాల్ టికెట్లు రిలీజ్ చేయగా కొందరికి ఒకే రోజు వేర్వేరు చోట్ల పరీక్షా కేంద్రాలు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అవసరమైతే అభ్యర్థులు సర్టిఫికెట్లు చూపించి సరిచేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఏమైనా సందేహాలుంటే ఫోన్/మెయిల్ ద్వారా పంపవచ్చని చెప్పారు.
Similar News
News October 4, 2024
బెయిల్ కోరుతూ హైకోర్టులో సజ్జల పిటిషన్
AP: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలంతో రాజకీయ కక్షలో భాగంగానే తనను ఇరికించారని వాపోయారు. కోర్టు షరతులకు కట్టుబడి ఉంటానని, బెయిల్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై నేడు కోర్టు విచారణ జరపనుంది.
News October 4, 2024
రేపటిలోగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి: సీఎం
TG: ఈనెల 5వ తేదీలోపు అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఎంపికైన 11,062 మంది అభ్యర్థులకు దసరా పండుగలోపు ఈనెల 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే 9,090 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
News October 4, 2024
కోలుకున్న రవితేజ.. దసరా తర్వాత షూటింగ్ షురూ
ఇటీవల షూటింగ్‌లో గాయపడిన రవితేజ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. దసరా తర్వాత ఈ నెల 14 సెట్స్‌లో అడుగుపెడతారని టాలీవుడ్ టాక్. భాను భోగవరపు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రీకరణలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరీ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్నారు.