News September 24, 2024

‘లాపతా లేడీస్‌’ టీమ్‌కు ప్రశాంత్ వర్మ అభినందనలు

image

ఈ ఏడాది భారత్ నుంచి ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ అయిన ‘లాపతా లేడీస్’ టీమ్‌కు హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్యులేషన్స్ కిరణ్ రావు అండ్ టీమ్. కొత్త తరహా కథల్ని చెప్పాలన్న మీ నిబద్ధత ఆ సినిమాలో కనిపించింది. ఆస్కార్లలోనూ మీ సినిమా రాణించాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. ‘లాపతా లేడీస్’ తన సినిమా హను-మాన్‌ను దాటి ఎంపికైనప్పటికీ ఆ మూవీ టీమ్‌కు ఆయన బెస్ట్ విషెస్ చెప్పడం విశేషం.

Similar News

News September 24, 2024

సీఎంపై అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

image

AP: సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లికి చెందిన బేరి తిరుపాలురెడ్డి సీఎంను అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తూ పోస్టులు పెట్టారు. స్థానిక టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 24, 2024

రాష్ట్రవ్యాప్తంగా 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: మంత్రి ఉత్తమ్

image

TG: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,139 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సన్నాలు, దొడ్డు వడ్లకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ఖరీఫ్ ‌ సీజన్‌లో 146.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నట్లు అంచనా వేశామన్నారు. ఈ ఖరీఫ్ నుంచి సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని వెల్లడించారు.

News September 24, 2024

పంత్ గేమ్‌ఛేంజర్.. అతడిపైనే మా దృష్టంతా: కమిన్స్

image

భారత్‌తో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తమ దృష్టంతా రిషభ్ పంత్‌పైనే ఉంటుందని ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ పేర్కొన్నారు. ‘మా ఫోకస్ అంతా పంత్ పైనే. ఆ ఒక్కడు నిలబడితే మ్యాచ్‌ను ప్రత్యర్థుల నుంచి లాగేసుకుంటాడు అనే ఆటగాడు ప్రతి జట్టుకు ఒకడుంటాడు. టీమ్ ఇండియా పంత్ అలాంటి ప్లేయరే. సిరీస్ గెలవాలంటే అతడిని మేం కట్టడి చేయాలి’ అని అభిప్రాయపడ్డారు.