News September 24, 2024
‘లాపతా లేడీస్’ టీమ్‌కు ప్రశాంత్ వర్మ అభినందనలు
ఈ ఏడాది భారత్ నుంచి ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ అయిన ‘లాపతా లేడీస్’ టీమ్‌కు హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్యులేషన్స్ కిరణ్ రావు అండ్ టీమ్. కొత్త తరహా కథల్ని చెప్పాలన్న మీ నిబద్ధత ఆ సినిమాలో కనిపించింది. ఆస్కార్లలోనూ మీ సినిమా రాణించాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. ‘లాపతా లేడీస్’ తన సినిమా హను-మాన్‌ను దాటి ఎంపికైనప్పటికీ ఆ మూవీ టీమ్‌కు ఆయన బెస్ట్ విషెస్ చెప్పడం విశేషం.
Similar News
News October 15, 2024
GREAT: తండ్రిని చంపిన హంతకుడిని పట్టుకునేందుకు పోలీస్‌గా మారింది
సినిమా స్టోరీని తలదన్నేలా తన తండ్రిని చంపిన వ్యక్తిని శిక్షించడం కోసం ఓ మహిళ పోలీస్‌గా మారిన ఘటన బ్రెజిల్‌లో జరిగింది. గిస్లేనే సిల్వా(35) అనే మహిళ తండ్రి జోస్ విసెంటేను 1999లో స్నేహితుడు రైముండే హత్య చేశాడు. 2013లో శిక్ష పడినా తప్పించుకున్నాడు. ఈ పరిణామాలు చూస్తూ పెరిగిన సిల్వా లా చదివారు. తర్వాత పోలీసుగా మారారు. ఇటీవల నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపగా, కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
News October 15, 2024
EVMల బ్యాటరీ కాలిక్యులేటర్ బ్యాటరీ లాంటిది: CEC
EVMల బ్యాటరీ కాలిక్యులేటర్ల బ్యాటరీ లాంటిదని CEC రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా పేజర్లను ఇజ్రాయెల్ పేల్చగలిగినప్పుడు, మన EVMల పరిస్థితేంటని కాంగ్రెస్ ప్రశ్నించడంపై ఆయన స్పందించారు. ఈవీఎంలలో కాలిక్యులేటర్ లాంటి సింగిల్ యూజ్ బ్యాటరీ ఉంటుందని, అది మొబైల్ బ్యాటరీ కాదని పేర్కొన్నారు. ఈవీఎంల బ్యాటరీలకు మూడంచెల రక్షణ వ్యవస్థ ఉంటుందని వివరించారు.
News October 15, 2024
మద్యంలో జగన్ రూ.40వేల కోట్ల దోపిడీ: అచ్చెన్నాయుడు
AP: రాష్ట్రంలోని వ్యవస్థలను YS జగన్ నాశనం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. మద్యంలో రూ.40వేల కోట్లు దోచుకున్నారని, ఇసుకలోనూ ఇలాగే కొల్లగొట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో నూతన లిక్కర్ పాలసీ వల్ల దరఖాస్తుల ద్వారానే రూ.1,800కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రేపు ఇసుక రీచ్‌లు మొదలవుతాయని, పది రోజుల్లో సమస్య తీరుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.