News September 24, 2024
లడ్డూలో పొగాకు పొట్లం వార్తలను ఖండించిన TTD

తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం ఉన్నట్లు వస్తోన్న <<14180009>>ఆరోపణలను<<>> టీటీడీ కొట్టిపారేసింది. ‘పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారు. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది. ఇంతటి పకడ్బందీగా ఉన్న వ్యవస్థలో పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయం’ అని ప్రకటన విడుదల చేసింది.
Similar News
News January 25, 2026
సూర్యుడు దేవుడా..?

కాలం అత్యంత శక్తిమంతమైనది. అది సృష్టిని నిర్మిస్తుంది. తిరిగి తనలోనే లీనం చేసుకుంటుంది. ఈ కాలం కంటికి కనబడదు. అలాంటి కాలాన్ని కొలిచే ప్రమాణమే సూర్యుడు. ఆయన వేసే ప్రతి అడుగు కాలానికి కొలమానం వంటిది. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, రోజులు, నెలలు అన్నీ సూర్యుని గమనంపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే కంటికి కనిపించని దైవానికి, కంటికి కనిపించే రూపమే సూర్యుడని నమ్ముతాం. ఆయనను ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం.
News January 25, 2026
కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.
News January 25, 2026
షోరూమ్‌లలో వెహికల్ రిజిస్ట్రేషన్ వాటికి మాత్రమే!

TG: వాహనదారులు ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లకుండా షోరూమ్‌ల వద్దే వెహికల్స్ <<18940796>>రిజిస్ట్రేషన్<<>> జరిగేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిస్టమ్ నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ప్రైవేట్ టూ వీలర్లు, కార్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, గూడ్స్ వాహనాలకు వర్తించదు. ఆ వాహనాలకు పాత పద్ధతిలో ఆర్టీఏ ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు.


